Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాన్ గాలికి విగ్ ఎగిరిపోతుందని బాలకృష్ణ పారిపోయాడు : ఆర్కే.రోజా

నంద్యాలలో ఫ్యాన్ గాలి బలంగా వీస్తోందని, ఈ గాలి వల్ల తన విగ్ ఎగిరిపోతుందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పారిపోయారని వైకాపా ఎమ్మెల్యే, నటి ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. నంద్యాల ఉపఎన్నికల

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2017 (06:14 IST)
నంద్యాలలో ఫ్యాన్ గాలి బలంగా వీస్తోందని, ఈ గాలి వల్ల తన విగ్ ఎగిరిపోతుందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పారిపోయారని వైకాపా ఎమ్మెల్యే, నటి ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో నిర్వహించిన రోడ్ షో‌లో ఆమె పాల్గొని ప్రసంగించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెల్లదొరల కంటే మనల్ని ఘోరంగా మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఓటర్లు కొట్టే దెబ్బతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాలన్నారు. మహిష్మతి సామ్రాజ్యం ఎప్పుడూ బాహుబలిదే. అలాగే, నంద్యాల గడ్డ ఎప్పుడూ వైఎస్ఆర్ కుటుంబానికే అని నిరూపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. 
 
2019లో మనం అధికారంలోకి రాబోతున్నాం.. రాజన్న రాజ్యాన్ని తెచ్చుకోబోతున్నాం. దానికి నాందిగా ఈ రోజు జరిగే ఈ ఉపఎన్నికల్లో నంద్యాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి ‘అబ్బా’ అనిపించేలాగా.. ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలి. పైగా, ఫ్యాన్ గట్టిగా వీస్తోంది.. విగ్ ఎగిరిపోతుందని బాలకృష్ణ పారిపోయాడు’ అని రోజా విమర్శించారు. 
 
అంతేకాకుండా, ఫ్యాన్ లోపల ఉంటుంది. సైకిల్ బయట ఉంటుంది. మనకు ఎప్పుడు పని వచ్చినా శిల్పా మోహన్ రెడ్డి పక్కనే ఉంటారు. బ్రహ్మానంద రెడ్డి ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదు!. కాబట్టి, ఎంత తిరిగినా ఇంట్లోకి వచ్చి ఫ్యాన్ వేస్తేనే చల్లగా ఉంటుందని, ఆ ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి శిల్పాను గెలిపించాలని రోజా పిలుపునిచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments