Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ సీపీ సరికొత్త కార్యక్రమం ‘నిన్ను నమ్మం బాబూ..’

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (10:44 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మక ద్రోహం, అన్యాయాలకు పాల్పడ్డారనీ, దీన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ‘నిన్ను నమ్మం బాబూ..’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లనుంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపునకు వచ్చిన నేపథ్యంలో ఈ యాత్రకు సంఘీభావంగా ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకూ వివిధ కార్యక్రమాలను నిర్వహించనుంది. 
 
జనవరి 3 నుంచి 7 వరకు ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఇంఛార్జ్ నాయకత్వంలో, నియోజకవర్గ బూత్ కమిటీ సమన్వయకర్త, మండల అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు ‘నిన్ను నమ్మం బాబూ..’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, రోజుకు రెండు చొప్పున పది గ్రామాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. 
 
గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు హామీలను, మోసాలను ప్రజలకు వివరించనున్నట్టు వైసీపీ తెలియజేసింది. అంతేకాదు చంద్రబాబు మోసాలకు వ్యతిరేకంగా ‘నిన్ను నమ్మం బాబూ..’ అంటూ ప్రజలను ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో తమ ప్రభావం చూపిస్తామని అంటోంది వైసీపీ. మరి జనం నిజంగా... నిన్ను నమ్మం బాబూ అని ఓట్లు వైసీపికి వేస్తారో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments