Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుమతీ శతకాలు వల్లిస్తే నమ్మేస్తారా బాబుగారూ : విజయసాయి రెడ్డి

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (15:43 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోమారు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. గత ఐదేళ్ళ కాలంలో ఏ తప్పూ చేయడనపుడూ భయమెందుకు బాబుగారూ అంటూ నిలదీశారు. 
 
ఇదే అంశంపై ఆయన మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని పోస్టులు చేశారు. ఒక వైపు నిజాయితీగా పనిచేశామని బాజా కొట్టుకుంటున్నారు. ఇంకో పక్క మాపై విచారణకు ఆదేశించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటారు. ఏ తప్పూ చేయని వారికి ఆందోళన ఎందుకు చంద్రబాబు గారూ..? 
 
రాష్ట్రాన్ని చెదపురుగుల్లా తినేసి ఇప్పుడు సుమతీ శతకాలు వల్లిస్తే నమ్మేస్తారా..? అంటూ ధ్వజమెత్తారు. తకుముందు మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా సీఎం జగన్, విజయసాయి రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని విరమ్శలు గుప్పించిన విషయం తెల్సిందే. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా సీఎం జగన్ వైఖరి వుంది : లోకేశ్ 
ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి వైఖరి ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. రైతులకు విత్తనాలు అందక పడుతున్న అవస్థలపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
వైకాపా అధికారంలో ఉంద‌ని మ‌రిచిపోయారా? 
 
విత్త‌నాలో జ‌గ‌న్ ప్ర‌భో అంటూ రైతులు గ‌గ్గోలు పెడుతుంటే..
 చంద్ర‌బాబు వ‌ల్లే విత్త‌నాలు ఇవ్వ‌లేక‌పోతున్నామంటున్నారు. 
 
 
 
 
ఒక‌టో తారీఖుకొచ్చే పింఛ‌ను రాలేదేమ‌ని పండుటాకులు నిల‌దీస్తే!
 గ‌త ప్ర‌భుత్వం వ‌ల్లే ఆల‌స్య‌మైంద‌ని స‌మాధానం ఇస్తున్నారు. 
 
 
బీమా రాలేదు.. మా బ‌తుకుల ధీమా ఏదీ అంటే! 
తెలుగుదేశం స‌ర్కారు వ‌ల్లే అంటూ మాట దాట‌వేస్తున్నారు.
 
 
 నేను విన్నాను.. నేను ఉన్నానంటూ సీఎం అయ్యి, పాలన చేతకాక.. ఇప్పుడు
చంద్ర‌బాబే వింటాడు.. చంద్ర‌బాబే ఉంటాడు అంటున్నారు.
 ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం వెల‌గ‌బెడుతున్న‌ది వైకాపానా? తెదేపానా? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం సంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sumati Shatakam : ఫ్యామిలీ, లవ్ స్టోరీగా సుమతీ శతకం రాబోతోంది

Vishal: మూడు డిఫరెంట్ షేడ్స్‌లో విశాల్ మకుటం పోస్టర్ విడుదల

Divvela Madhuri: బిగ్ బాస్ గేమ్ షోలోకి అడుగుపెట్టనున్న దివ్వెల మాధురి

Suri: సూరి న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మామ‌న్‌ స్ట్రీమింగ్‌

మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల క‌థాంశంతో మోహ‌న్.జి భారీ చిత్రం ద్రౌప‌తి -2 ఫ‌స్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments