Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ను కలిసిన వైకాపా ఎంపీలు... జగన్ కలవమన్నారా!

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఏపీకి చెందిన వైకాపా నేతలు కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మంగళవారం తిరుపతి విమానాశ్రయంకు చేరుకుని అక్కడి నుంచి నేరు

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (12:07 IST)
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఏపీకి చెందిన వైకాపా నేతలు కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మంగళవారం తిరుపతి విమానాశ్రయంకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా తిరుమలకు వచ్చిన కేసిఆర్‌ను వెంటనే రాజంపేట వైకాపా ఎంపి మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు కలిశారు. వారితో పాటు మరికొంతమంది నేతలు ఉన్నారు.
 
కేసీఆర్ ఇప్పటివరకు ఎవరికి అపాయింట్మెంట్ తిరుమలలో ఇవ్వకుండా వైకాపా నేతలను మాత్రమే కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చెందిన ఆస్తులతో పాటు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి చెందిన ఆస్తులు కూడా తెలంగాణా రాష్ట్రాలలో ఉండడంతో కేసీఆర్‌ను కలిసినట్లు సమాచారం. వారివారి ఆస్తులను కాపాడుకునేందుకే కేసీఆర్‌ను వైకాపా నేతలు కలిసినట్లు తెలుస్తోంది. 
 
ఇప్పటికై అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న జగన్ తెలంగాణా ప్రాంతంలో ఉన్న తన ఆస్తులను కాపాడుకునేందుకు కేసిఆర్‌తో సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కేసిఆర్‌ను మచ్చిక చేసుకునేందుకు వైకాపా నేతలను తిరుమలకు పంపించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద వైకాపా నేతలు కేసిఆర్‌ను కలవడం మాత్రం ప్రాధాన్యతను సంతరించుకుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments