పవన్ కల్యాణ్ సిబ్బందికి కరోనా వస్తే.. బాబుకు ఏమైంది..?: మంత్రి అనిల్ ఫైర్

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (13:31 IST)
ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తిరుపతి ఎన్నికల ప్రచార సభ విరమించుకుంటే దానిపై కూడా రాజకీయాలా? అని మండిపడ్డారు మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్. పవన్ కల్యాణ్ సిబ్బందికి కరోనా వస్తే.. పవన్ ఇంట్లో పడుకుంటే.. టీడీపీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
 
మరోవైపు.. వకీల్ సాబ్ సినిమా టికెట్ల వ్యవహారంపై స్పందించిన మంత్రి అనిల్.. పవన్ సినిమా టికెట్ల ధరల పెంచొద్దు అంటే.. చంద్రబాబుకు ఏం నొప్పి అంటూ ఫైర్ అయ్యారు.. బ్లాక్ మార్కెట్‌ని మేం ప్రోత్సహించాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, వకీల్ సాబ్‌ని చూసి సీఎం జగన్ భయపడ్డాడని అంటారా.?... ఏ సాబ్ వచ్చినా మా లీడర్ వణకడు.. ఆయన చాలా మందిని చూశారని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ సినిమా టికెట్ల ధరలు పెంచొద్దు అంటే చంద్రబాబుకు ఏం నొప్పి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు 
 
ఈ నెల 17వ తేదీ తర్వాత మీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధంగా ఉండాలంటూ సవాల్ విసిరిన మంత్రి అనిల్.. ఆ ఏడుకొండల వెంకన్న ఆశీసులు ఎవరికున్నాయో 17 తర్వాత తేలిపోతుందన్నారు. మీ మీద మీకు నమ్మకం వుంటే... మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రాజీనామా చేసి రండి.. ప్రజల్లో ఎవరి దమ్ము ఏంటో తేలిపోతుంది... ఆ దమ్ము మీకుందా...? సవాల్ చేశారు. ఇక, తప్పుడు ప్రచారాలు చేస్తే... కేసులు తప్పవు అని హెచ్చరించారు.
 
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు ఒక్కటే అని తేలిపోయిందని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మేలును చెప్పుకుంటూ.. గర్వంగా తాము ఓటు అడుగుతున్నామన్న ఆయన.. టీడీపీ ఏమీ చెప్పుకొని ఓటు అడుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments