కేజీహెచ్‌లో అడుగుపెడితే పదవి పోతుందా..? మరి సీఎం జగన్ పరిస్థితేంటి?

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (19:11 IST)
1995లో ఎన్టీఆర్ కేజీహెచ్‌లో అడుగుపెట్టాక పదవి పోయిందని... ఆ తర్వాత అక్కడ మరే ముఖ్యమంత్రి అడుగుపెట్టలేదని వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ తెలిపారు. మళ్లీ ఇప్పుడు జనాల కోసం వైస్. జగన్ అడుగుపెట్టారని వరప్రసాద్ చెప్పారు. 
 
జగన్‌కు ప్రజా సంక్షేమమే ప్రధానమని, పదవి కాదని వరప్రసాద్ వెల్లడించారు. గ్యాస్ లీక్ ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు కేజీహెచ్ ఆసుపత్రికి జగన్ వెళ్లిన సంగతి తెలిసిందే. 
 
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు పదవులు ముఖ్యం కాదన్నారు. ఈ మేరకు ఆయన ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ఒక ముఖ్యమంత్రి ధైర్యం చేసి 25 సంవత్సరాల తర్వాత మళ్లీ విశాఖ కేజీహెచ్‌లో అడుగుపెట్టారని చెప్పారు.
 
ఇకపోతే.. విశాఖ కేజీహెచ్‌‌లో అడుగు పెడితే పదవి పోతుందనే ఎప్పటి నుంచో సెంటిమెంట్ ఉందట. గతంలో ఎన్టీఆర్ ఆస్పత్రిలో అడుగు పెట్టి ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్నారట. అప్పటి నుంచి సీఎంలు, పదవుల్లో ఉన్నవారు అక్కడికి వెళ్లరనే ప్రచారం ఉంది. అంతేకాదు గత ప్రభుత్వంలో కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అయ్యిందట. 
 
మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాస్ కేజీహెచ్‌కు వెళ్లారట. రాత్రి అక్కడే బస చేశారట.. కొద్దిరోజులకే ఆయన పదవి పోయిందని అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు ప్రస్తావించారు. మరి జగన్ పరిస్థితి ఏంటని.. ఆయన పదవి ఏమౌతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments