మీడియా కంటపడకుండా ఎట్టకేలకు లొంగిపోయిన బోరుగడ్డ!

ఠాగూర్
బుధవారం, 12 మార్చి 2025 (09:07 IST)
ప్రముఖ రౌడీషీటర్, వైకాపా నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ఎట్టకేలకు బుధవారం ఉదయం రాజమండ్రి జైలు అధికారుల ఎదుట లొంగిపోయాడు. నిజానికి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఆయన లొంగిపోవాల్సివుంది. కానీ, ఆయనకు మరోమారు మధ్యంంతర బెయిల్‌ను పొడగించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయనకు మరోమార్గం లేక బుధవారం లొంగిపోయాడు. 
 
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌, వారి కుటుంబ సభ్యులను దూషించిన కేసులో అరెస్టయిన మధ్యంతర బెయిలుపై ఉన్న వైకాపా నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు. 
 
తల్లికి ఆరోగ్యం బాగోలేదన్న కారణంతో మధ్యంతర బెయిల్ పొందిన అనిల్ గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. అయినప్పటికీ లొంగిపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన రాజమండ్రి కేంద్ర కారాగారంలో లొంగిపోయాడు. 
 
తల్లి అనారోగ్యం పేరుతో బెయిలు పొడిగించుకునేందుకు అనిల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మధ్యంతర బెయిల్‌ను పొడగించే ప్రసక్తే లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మంగళవారం (11) సాయంత్రం 5 గంటల్లోపు లొంగిపోవాల్సిందేనని స్పష్టం చేసింది. అయినప్పటికీ అజ్ఞాతం వీడకపోవడంతో లొంగిపోతాడా? లేడా? అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఆయన మీడియా కంటపడకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకుని జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

Samyukta: ప్రాక్టీస్ తర్వాత మోకాలు నొప్పి తో ఫిజియోథెరపీ తీసుకున్నా : సంయుక్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments