Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూళ్లూరుపేటలో పుట్టిన రోజే వైకాపా నేత దారుణ హత్య

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (12:33 IST)
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో దారుణం జరిగింది. వైకాపా నేత తన పుట్టినరోజు నాడే హత్యకు గురయ్యాడు. సూళ్లూరుపేటలో సోమవారం పట్టపగలే వైసీపీ కౌన్సిలర్ తాళూరు సురేశ్(40) అనే వైకాపా నేతను గుర్తు తెలియని వ్యక్తులు చంపేసారు. కారు పార్క్ చేస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయనపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. పుట్టినరోజు నాడే సురేష్ హత్యకు గురికావడం గమనార్హం.
 
ఈ నెల 9 సురేష్ పుట్టినరోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లారు. శ్రీవారి దర్శనం అనంతరం సాయంత్రం సమయంలో తిరిగి సూళ్లూరుపేటకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఇంటి వద్ద దింపిన సురేష్.. సమీపంలోని రైల్వే కేబిన్ రోడ్డులో కారును పార్క్ చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో గుర్తు తెలియని అగంతకులు కత్తులతో ఆయనపై దాడికి తెగబడ్డారు.
 
చాలాసేపటి వరకు సురేష్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. పార్కింగ్ ప్రదేశానికి వెళ్లి చూడగా సురేష్ రక్తపు మడుగులో పడి కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం​ గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments