Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ బిల్లుకు అడ్డు తగులుతా... అసెంబ్లీ ఎలా జరుగుతుందో చూస్తా!

మిర్చి రైతులతో పాటు ఇతర వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు నల్లపాడు రోడ్డులో దీక్ష చేపట్టారు. సోమవారం ప్రారంభమైన ఈ దీక్ష మంగళవారం మధ్యాహ్నం

Webdunia
బుధవారం, 3 మే 2017 (09:08 IST)
మిర్చి రైతులతో పాటు ఇతర వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు నల్లపాడు రోడ్డులో దీక్ష చేపట్టారు. సోమవారం ప్రారంభమైన ఈ దీక్ష మంగళవారం మధ్యాహ్నం ముగిసింది. ఓ రైతు చేతులమీదుగా నిమ్మరసం తాగి జగన్ దీక్ష విరమించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలోని చంద్రబాబు సర్కారుపై జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
రైతు కంట కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వానికీ పుట్టగతులుండవన్నారు. చంద్రబాబు సీఎం అయితే వెంటనే కరువూ వస్తుందన్నారు. ఇప్పటికీ ప్రభుత్వంలో కదలిక రాకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతు దీక్షతో ప్రభుత్వం స్పందించని పక్షంలో జీఎస్టీ బిల్లు ఆమోదానికి అడ్డు తగులుతామని.. ఇందుకోసం త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాలను ఎలా జరుపుతారో చూస్తానని జగన్ వార్నింగ్ ఇచ్చారు. 
 
మూడేళ్లలో మూడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. పనిలో పనిగా సీఎం తనయుడు నారా లోకేష్‌పై జగన్ విమర్శలు గుప్పించారు. ఇటీవల కొందరు మంత్రులు చంద్రబాబు తనయుడు లోకేష్‌ను... లోకేష్‌ కాదంట లోక్యాష్‌ అని కామెంట్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments