సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసే శాసనసభ, లోక్‌సభ సభ్యులను వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ప్రటించారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లతో పాటు.. 25 లోక్‌సభ స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించారు.
ఇడుపులపాయలో జగన్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాపై పలువురు హర్షం వ్యక్తంచేస్తుండగా, టిక్కెట్లు ఆశించిన భంగపడిన నేతల ప్రాంతాల్లో కాస్త అలజడి చెలరేగింది. 2014 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో 42 మందికి జగన్ మరో ఛాన్స్ ఇచ్చారు. వైసీపీ తరఫున సిట్టింగ్ స్థానాలను మళ్లీ దక్కించుకున్న అభ్యర్థులు వీరే..