Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కారును ఇరకాటంలో పెట్టిన వైఎస్ వివేకా కుమార్తె.. నాన్నది రాజకీయ హత్యే!

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (16:54 IST)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆయన కుమార్తె సునీతా రెడ్డి మరోసారి గళం విప్పారు. జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి రెండేళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటి వరకూ నిందితులను పట్టుకోలేదని ఆయన కుమార్తె సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో సీబీఐ అధికారులను వైఎస్ సునీత కలిశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తన తండ్రి హత్య గురించి వదిలేయమని తనకు చాలా మంది సలహా ఇచ్చారని సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
అయితే, తన మనసు మాత్రం న్యాయం కోసం పోరాడమని చెబుతోందని స్పష్టం చేశారు. తన తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎంకు సోదరుడని.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయానా బాబాయ్‌ అని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తనకు న్యాయం జరగడం లేదని వాపోయారు.
 
తన తండ్రి హత్య కేసు విచారణ సరిగా జరగడం లేదని సునీత ఆరోపించారు. సొంత కుటుంబానికి చెందిన తమకే న్యాయం జరగకపోతే సామాన్యుడి పరిస్థితేంటని ఆమె ప్రశ్నించారు. తన తండ్రి హత్య కేసుపై సరిగా విచారణ జరగట్లేదని ఆరోపించారు. న్యాయం కోసం ఇంకెంతకాలం వేచిచూడాలని నిలదీశారు. తన తండ్రిని హత్య చేసింది ఎవరో అందరికీ తెలియాల్సిందేనని తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments