11 సీట్లు వచ్చినా మీరు అసెంబ్లీకి వెళ్లలేదు.. మాకు సీట్లు రాక వెళ్లలేదు : వైఎస్ షర్మిల (Video)

ఠాగూర్
గురువారం, 14 నవంబరు 2024 (14:27 IST)
వైకాపాను, ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోమారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైకాపాకు, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం తేడాలేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు 11 సీట్లు వచ్చిన వైకాపా హాజరుకావడం లేదు. అలాగే, ఒక్క సీటురాని కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. దీనిపై షర్మిల స్పందిస్తూ, మీది మాది ఒకటే కథ. 11 అసెంబ్లీ సీట్లు వచ్చి అసెంబ్లీకి వెళ్లకుండా మీకు.. సీట్లు ఏమీ రాని మాకు తేడా ఏముంది? అసెంబ్లీకి ఎందుకు వెళ్లలేదంటే సమాధానం చెప్పకుండా కాంగ్రెస్‌ను ఇన్‌సఫిషియంట్ అంటున్నారు? కాంగ్రెస్ వల్ల ఎదిగి కాంగ్రెస్‌ పార్టీనే తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఆ అర్హత మీకు లేదు అంటూ జగన్మోహన్ రెడ్డికి షర్మిల ఘాటుగా కౌంటరిచ్చారు. 
 
అంతేకాకుండా గత ఎన్నికల్లో జగన్ పార్టీకి 38 శాతం ఓటు వచ్చినా అసెంబ్లీకి వెళ్లనపుడు, వైకాపాకి, కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఏం లేదన్నారు. 38 శాతం ఓట్ షేర్ పెట్టుకుని అసెంబ్లీకి పోనీ వైకాపాని నిజానికి ఒక ఇన్‌సఫిసియంట్ పార్టీగా మార్చింది జగన్మోహన్ రెడ్డేనని ఆమె పేర్కొన్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టలేని ప్రజా సమస్యల కోసం సభల్లో పట్టుబట్టలేని, పాలకపక్షానన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని, అసమర్థ వైకాపా ఇవాళ రాష్ట్రంలో అసలైన ఇన్‌సిఫిసియంట్ పార్టీ అంటూ ధ్వజమెత్తారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments