Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు విశాఖపట్టణం పర్యటనకు సీఎం జగన్

Webdunia
గురువారం, 11 మే 2023 (08:53 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం విశాఖపట్టణం పర్యటనకు వెళుతున్నారు. ఇందుకోసం ఆయన గన్నవరం నుంచి విమానంలో విశాఖ చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టరులో పీఎం పాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వెళతారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 
 
ఆ తర్వాత హెల్త్ సిటీలోని అపోలో ఆస్పత్రిలో కేన్సర్ విభాగాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బీచ్ రోడ్డులో వీఎంఆర్డీఏ నిర్మించిన సీ హ్యారియర్ యుద్ధ విమాన మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచే ఎంవీపీ కాలనీలో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను, రామనగర్‌లోని వాణిజ్య సముదాయాన్ని ప్రారంభిస్తారు. 
 
ఆ తర్వాత ఎండాడలో నిర్మించనున్న కాపు భవన్‌కు శంకుస్థాపన చేస్తారు. పిమ్మట పక్కనే ఉన్న ఏయూ కన్వెన్షన్ సెంటరులో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అక్కడ నుంచి విమానాశ్రయానికి చేరుకొని తిరిగి విజయవాడలోని తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments