Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ జగన్ భద్రత కుదింపు పిటీషన్‌పై వచ్చే వారం విచారణ!

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (17:18 IST)
భద్రత కుదింపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపి ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌ మోహన్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. తనకు కేటాయించిన జెడ్ కేటగిరీ భద్రత (6+6)ను తొలగించి, (1+1) వ్యక్తిగత భద్రత సిబ్బంది, (1+1) ముఖ్య భద్రతాధికారిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. 
 
గత మూడేళ్ల నుంచి తనకు కొనసాగుతూ వచ్చిన జెడ్ కేటగిరీ భద్రతను యథాతథంగా కొనసాగించేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ఆయన సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హోంశాఖల ముఖ్య కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, వైఎస్సార్ జిల్లా ఎస్‌పీ, రాష్ట్రస్థాయి భద్రత సమీక్ష కమిటీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు పూర్తి స్థాయి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments