Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీజీపీని టీడీపీ నేతలు అన్నా, మామా అంటూ పిలుస్తారు!: జగన్

Webdunia
సోమవారం, 4 మే 2015 (14:35 IST)
ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడుపై వైకాపా అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ నేతలతో సత్సంబంధాలను కలిగి ఉన్న డీజీపీ... ఆ పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఆయన సొంత జిల్లా అనంతపురంలోనే హత్యలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 
 
డీజీపీని టీడీపీ నేతలు... అన్నా, మామా అంటూ పిలుస్తారని అన్నారు. ప్రసాద్ రెడ్డి హత్య విషయంలో స్థానిక ఎస్ఐని వీఆర్‌కు వేస్తే, మరుసటి రోజే తిరిగి పోస్టింగ్ ఇచ్చారని మండిపడ్డారు. రెండు నెలల్లో రిటైర్ కావాల్సిన డీజీపీ రాముడుకి రెండేళ్ల సర్వీస్ పొడిగించారని విమర్శించారు.
 
ఏపీలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు. తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన పార్టీ నేత ప్రసాద్ రెడ్డి హత్యను ఆయన ప్రస్తావించారు. వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు సర్కారు యత్నిస్తోందని ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న అధికారపక్షాన్ని నిలువరించాలని ఆయన గవర్నర్ కోరారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments