Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలాగూ వాళ్లు పెట్టిన అభ్యర్థే గెలుస్తారు... ఇక పోటీ ఎందుకు? జగన్ ప్రశ్న

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రధానితో భేటీ ముగిసాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. అలాగే అగ్

Webdunia
బుధవారం, 10 మే 2017 (13:38 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రధానితో భేటీ ముగిసాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. అలాగే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరాననీ, 19 రకాల పంటలకు గిట్టుబాటు ధర రావడంలేదనీ, రైతులను ఆదుకోవాలని కోరినట్లు వెల్లడించారు. 
 
రాష్ట్రపతి ఎంపికపై మాట్లాడుతూ... ఎన్డీఏకు కావలసినంత మెజార్టీ ఉంది. రాష్ట్రపతి అభ్యర్థిగా వారు ఎవరిని అనుకుంటారో వారే విజయం సాధిస్తారు. అలాంటప్పుడు ప్రతిపక్షాలు మరో అభ్యర్థిని పోటీ పెట్టి ప్రయోజనం ఏంటి? అయినా దేశంలో అత్యున్నత స్థాయి పదవికి ఎంపిక చేసే అభ్యర్థిని అన్ని పార్టీలు కలిసి చర్చించి ఓ నిర్ణయం తీసుకుని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బావుంటుందన్నారు. తమ పార్టీ మాత్రం ప్రధానమంత్రి మోదీ ఎవరిని ఎంపికి చేస్తారో వారికే మద్దతు పలుకుతుందని స్పష్టం చేశారు.
 
తమకు భాజపాకు రెండు విషయాల్లోనే తేడాలున్నాయనీ, ఒకటి ప్రత్యేక హోదా రెండవది భూ సమీకరణ అని చెప్పారు. ఇలాంటి విషయాలు తప్ప మిగిలినవాటిలో తమకు భాజపాతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ స్టైల్ వేరు.. చెర్రీ అన్న సరదాగా ఉంటారు : నిహారిక

హీరో విశాల్‌కు ఏమైంది? మేనేజర్ వివరణ...

విశాల్ ఆరోగ్యానికి ఏమైందంటే? ఖుష్బూ వివరణ

శ్రీలీలపై కన్నేసిన బాలీవుడ్ హీరోలు!!

Actress Ramya: ఆ సన్నివేశాలను తొలగించాలి... కోర్టును ఆశ్రయించిన నటి రమ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments