పోలీసులూ జాగ్రత్త.. బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్ (Video)

ఠాగూర్
మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (16:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీ కార్యకర్తలు, నేతలను వేధించే ప్రతి పోలీస్ అధికారికి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామంటూ హెచ్చరించారు. 
 
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఆయన మంగళవారం పర్యటించారు. ఇటీవల హత్యకు గురైన వైకాపా కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఆ తర్వాత జగన్ మీడియాతో మాట్లడుతూ, తప్పు చేసే ప్రతి పోలీస్ అధికారికి భవిష్యత్‌లో శిక్ష తప్పదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టలూడదీసి ఉద్యోగాలు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. టీడీపీకి కొమ్ముకాస్తూ వైకాపా శ్రేణులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
తప్పు చేసినన ఏ ఒక్క పోలీస్ అధికారిని వదలం. బట్టలు ఊడదీసి నిలబెడతాం అంటూ పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యకాండ రాష్ట్రంలో పెరిగిపోయిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం పోలీసులు ఇష్టమొచ్చినట్టు చేస్తున్నారని, అలా చేస్తే భవిష్యత్‌లో చిక్కుల్లో పడతారన్నారు. 
 
రాష్ట్రంలో ఎల్లకాలం ఈ కూటమి ప్రభుత్వమే ఉండదన్నారు. చంద్రబాబుకు ఊడిగం చేసే పోలీసుల బట్టలు ఊడదీస్తామన్నారు. ఆ తర్వాత చట్టం ముందు దోషులుగా నిలబెట్టడంతో పాటు వారికి ఉద్యోగాలు లేకుండా చేస్తామంటూ ఘాటుగా హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments