ఆకారంలో పెరిగాడు.. బుర్ర మాత్రం పెరగలేదు : వైఎస్. జగన్

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (16:36 IST)
టీడీపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ ఉపనేత కె.అచ్చెన్నాయుడుపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిడ్డారు. ఆకారం(సైజు)లో మాత్రం పెరిగాడనీ, బుర్ర పెరగలేదన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, అచ్చెన్నాయుడు చేసిన ప్రసంగానికి జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 
 
ముఖ్యంగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును విలన్‌గా పేర్కొనడాన్ని టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అపుడు జగన్ కల్పించుకుని అచ్చెన్నాయుడుపై మండిపడ్డారు. 
 
'అచ్చెన్నాయుడు మనిషేమో ఈ సైజ్‌లో పెరిగాడు. బుర్ర మాత్రం అరికాలులో కూడా ఉండటం లేదు. బుర్ర ఎందుకు పెరగలేదో ఆయనే ప్రశ్నించుకోవాలి' అంటూ విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలతో టీడీపీ సభ్యులు మరింత మండిపడ్డారు. 
 
అంతకుముందు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రతిపక్షంపై విమర్శలకే సభా సమయాన్నంతా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. అర్థంలేని ఆరోపణలతో సమయాన్ని వృథా చేస్తున్నారని అన్నారు. విచారణల పేరుతో కాలం గడిపేయాలని జగన్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 
 
అవినీతి ఆరోపణలతో పోలవరం పనులను కూడా దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో పోలవరం పనులు 66 శాతం పూర్తయ్యాయని... కేంద్రం నుంచి నిధులను తెచ్చుకోవడం చేతకాక... టీడీపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
 
రాష్ట్రంలో అధికార మార్పిడి చోటుచేసుకోవడంతో అన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయన్నారు. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన పీపీఏలపై బురద చల్లాలనుకున్న వైసీపీ ప్రభుత్వం చివరకు అభాసుపాలయిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వలేదని జగన్ అన్నారని... చివరకు ఆధారాలను బయటపెట్టేసరికి ప్లేటు ఫిరాయించారని ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments