నేను, అమ్మ, పాప ముగ్గురం అడిగినా ఆమె ఒప్పుకోలేదు: జగన్

దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి మరణానికి అనంతరం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర కొన్ని జిల్లాల వరకే పరిమితం అయ్యింది. ఈ యాత

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2017 (16:25 IST)
దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి మరణానికి అనంతరం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర కొన్ని జిల్లాల వరకే పరిమితం అయ్యింది. ఈ యాత్ర ద్వారా జగన్‌కు యమా క్రేజ్ వచ్చింది.

కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్రకు అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అనుమతి ఇవ్వలేదు. దీంతో జగన్‌కు - సోనియా గాంధీకి విబేధాలు ఏర్పడ్డాయి. ఫలితంగా జగన్  కాంగ్రెస్ నుంచి వైదొలగి.. కొత్త పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సోనియా గాంధీతో ఏర్పడిన వివాదానికి కారణాలేంటో చెప్పారు. తాను, అమ్మ, పాప ముగ్గురం కలిసి చివరిగా సోనియా గాంధీని విజ్ఞప్తి చేశామని., కానీ ఆమె ఒప్పుకోలేదు.

సోనియా గాంధీ ఆ రోజే అంగీకరించివుంటే సమస్య ఇంతదూరం వచ్చేది కాదని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అసలు ఓదార్పు యాత్రకు ఆమె పర్మిషన్ ఎందుకు తీసుకోవాలో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఓదార్పు యాత్ర చేపట్టానని జగన్ వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశాఖపట్నం రోడ్డు ప్రమాదం.. డ్యాన్స్ మాస్టర్ పండు తీవ్రగాయాలు (video)

రోడ్డు ప్రమాదంలో 'ఢీ' జోడీ డ్యాన్స్ మాస్టర్ పండుకు గాయాలు

'పెద్ది' చిత్రం టిక్కెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన సర్కారు

చెర్రీతో సెల్ఫీ కోసం ఎగబడి జాన్వీ మీద పడ్డ అభిమాని, దూదిలా లేపేసిన చరణ్ బాడీగార్డ్, వీడియో

ఏదోరకంగా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు, అందుకే తెలంగాణలో గొడవ

తర్వాతి కథనం
Show comments