Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పెద్ద మనిషి కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ : పవన్‌పై జగన్ సెటైర్లు

ఠాగూర్
బుధవారం, 5 మార్చి 2025 (16:00 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆ పెద్ద మనిషి పవన్ అంటూ వ్యాఖ్యానించిన జగన్... పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటూ వ్యాఖ్యానించి పైగా, ఆయన ఎమ్మెల్యేగా ఒక్కసారి మాత్రమే గెలిచారంటూ ఎద్దేవా చేశారు. 
 
ఆయన బుధవారం తన తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైకాపా ప్రతిపక్ష హోదా రాదని, ఆయనకు వచ్చిన సీట్లకు జర్మనీలోనే ప్రతిపక్ష హోదా వస్తుందంటూ ఇటీవల పవన్ కామెంట్స్ చేశారు. 
 
ఈ వ్యాఖ్యలపై జగన్ తనదైనశైలిలో స్పందించారు. "ఆ మనిషి కార్పొరేటర్‌కు ఎక్కువ. ఎమ్మెల్యే తక్కువ. ఆయన జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు" అని అన్నారు. ఇకపై వైకాపా పాలనలో చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా ఇచ్చామని జగన్ గుర్తు చేశారు. 
 
తమ పార్టీకి చెందిన నేతలు 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలను లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోతుందని అన్నారనీ, కానీ తానే వారిని వారించి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదాను కొనసాగించానని చెప్పారు. పైగా, ఇంతమంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా అనేది ఎక్కడా లేదని జగన్ కొత్త వితండ వాదాన్ని తెరపైకి తెచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments