Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమా నాగిరెడ్డి మృతి... కుటుంబ సభ్యుడిని కోల్పోయా.. జగన్ : బాలయ్య దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ కుటుంబంలో ఒక సభ్యుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు

Webdunia
ఆదివారం, 12 మార్చి 2017 (13:50 IST)
కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ కుటుంబంలో ఒక సభ్యుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జరుగనున్న భూమా అంత్యక్రియలకు జగన్ కుటుంబసభ్యులు హాజరుకానున్నట్టు సమాచారం. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో ఆయన అనుచరులు, కార్యకర్తలు, మద్దతుదారులు కన్నీరు మున్నీరవుతున్నారు.
 
అలాగే, భూమా మృతిపై సినీ నటుడు బాలకృష్ణ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భూమా మృతిపై బాలయ్య స్పందిస్తూ.. ఏపీ నూతన అసెంబ్లీలో భూమా నాగిరెడ్డితో తాను మాట్లాడినప్పుడు ఆయన ఆరోగ్యంగా కనిపించారని, ఒక్కసారిగా ఇలా జరగడం చాలా దురదృష్టకరమన్నారు. నంద్యాల నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు మరచిపోలేనివని, రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన భూమా మృతి తీరని లోటని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments