Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెల్టాను ఎండబెట్టారు.. రైతుల ఉసురు తీశారు.. మీరు మనిషేనా బాబూ: జగన్ ధ్వజం

కృష్ణా జిల్లాలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో సోమవారం పర్యటించిన వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్కడ పంటల నష్టాన్ని కళ్లారా చూసి శివాలెత్తిపోయారు. పచ్చని పంటపొలాలతో సస్యశ్యామలంగా ఉండాల్సిన కృష్ణా జిల్లా డెల్టాను బంజరు భూములుగా చేసిన ఘనత చంద్

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (05:57 IST)
కృష్ణా జిల్లాలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో సోమవారం పర్యటించిన వైకాపా అధినేత  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్కడ పంటల నష్టాన్ని కళ్లారా చూసి శివాలెత్తిపోయారు. పచ్చని పంటపొలాలతో సస్యశ్యామలంగా ఉండాల్సిన కృష్ణా జిల్లా డెల్టాను బంజరు భూములుగా చేసిన ఘనత చంద్రబాబుదేనని ధ్వజమెత్తారు. రాజధానిలోనే ఉంటున్నానని డబ్బాలు కొట్టుకునే ముఖ్యమంత్రీ, ఈ జిల్లాలోనే ఉన్న ఇరిగేషన్ మంత్రీ ఇద్దరూ పచ్చని పొలాల్లో పంటలు చచ్చిపోతుంటే కళ్లప్పగించి చూస్తున్నారనంటూ మండిపడ్డారు. 
 
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రెండేళ్లుగా కృష్ణా డెల్టాకు సరిగా నీళ్లు ఇవ్వడమే లేదు. పంటలు చచ్చిపోతున్నాయని రైతులు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. రాజధానిలో మూడునాలుగు పంటలు పండే 54వేల ఎకరాలను బలవంతంగా తీసుకుంటారు. డెల్టాలోనేమో పంటలకు సాగు నీరే ఇవ్వరు. ఈ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది’ అని తీవ్రంగా వైఎస్‌ జగన్‌ తీవ్రంగా విమర్శించారు. 
 
దివంగత ముఖ్యమంత్రి  వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన హయాంలోనే పులిచింతల ప్రాజెక్టు పూర్తి చేశారు. తెలంగాణాకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కింద పెండింగ్‌లో ఉన్నరూ.120 కోట్లు చెల్లిస్తే ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మేరకు 45 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు. అప్పుడు పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి అక్కడి నుంచి డెల్టాకు నీరు అందించవచ్చు. అలా చేస్తే వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాటన్‌ దొర మాదిరిగా డెల్టా ప్రజల గుండెల్లో ఉండిపోతారని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే తెలంగాణ ఎన్ని లేఖలు రాసినా రూ.120 కోట్లు ఇవ్వడం లేదు. దిక్కుమాలిన ఆలోచనలు చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వైఎస్ జగన్ ఆక్షేపించారు.
 
పట్టిసీమ నీళ్లు ఎక్కడికి వెళ్లాయో తెలీడమే లేదు.  ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ ఏడాది ఇప్పటికీ 55 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి  విడిచిపెట్టారు. ఇక ఆ పట్టిసీమ వల్ల ఉపయోగమేమిటి  కృష్ణ, గోదావరి రెండింటికీ ఒకేసారి వరదలు వస్తాయని మేం ఎప్పటి నుంచో చెబుతున్నాం. నిల్వ సదుపాయం లేకుండా కమీషన్ల కోసం తెచ్చిన వృథా ప్రాజెక్టు అది. నిల్వ సదుపాయం ఉన్నా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రాజెక్టు పులిచింతల.. ఈ రెండింటినీ పరిశీలిస్తే చాలు చంద్రబాబు రైతులకు ఎంత అన్యాయం చేస్తున్నాడో తెలుసుకోవడానికి’’ అని జగన్‌ పేర్కొన్నారు. 
 
చంద్రబాబు ఇదే గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచే వెళ్తుంటారు. కానీ ఏనాడూ గన్నవరం నియోజకవర్గంలో ఎండిపోయిన పంటలు ఎలా ఉన్నాయో చూసిన పాపాన పోలేదు. ఇరిగేషన్‌ మంత్రిదీ ఇదే జిల్లా. ఆయన కూడా ఇదే గన్నవరం ఎయిర్‌పోర్టుకు నుంచే వెళ్తుంటారు. ఆయనా ఒక్కసారి కూడా నియోజకవర్గంలో పంటల గురించి, రైతుల గురించి పట్టించుకోనే లేదు. పంటలు పోయి రైతులు ఆగచాట్లు పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు. రైతులకు పూర్తి న్యాయం జరిగే వరకు నేను, మా పార్టీ  అండగా ఉంటాం అని జగన్ చెప్పారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్ ఏకిపారేస్తున్న వైకాపా

కన్నడ హీరో యష్‌తో కియారా అద్వానీకి కలిసి వస్తుందా?!!

సామాన్య వ్యక్తిలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు: జాతీయ మీడియాల్లో వక్ర చర్చలు

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి

అమెజాన్ ప్రైమ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్ రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

తర్వాతి కథనం
Show comments