Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ జగన్.. ప్రజలు తలచుకుంటే గుడ్డలూడదీసి నిలబెడతారు.. పోలీసులా..? దొంగలా? : చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (15:51 IST)
మిస్టర్ సైకో సీఎం జగన్ రెడ్డి.. గుర్తు పెట్టుకో.. ప్రజలు తలచుకుంటే గుడ్డలూడదీసి నిలబెడతారంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రచార రథాన్ని పోలీసులు దొంగిలించడంపై కూడా ఆయన మండిపడ్డారు. వీళ్లు పోలీసులా.. దొంగలా అంటూ సూటిగా ప్రశ్నించారు. గత మూడు రోజులుగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు శుక్రవారం కూడా పాదయాత్ర చేశారు. ఆయన గుడిపల్లిలోని టీడీపీ కార్యాలయానికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 
 
తాను ఎక్కడ మాట్లాడాలో చెప్పాలంటూ పోలీసులను అడిగినా వారు మౌనంగా దిష్టిబొమ్మల్లా నిల్చుండిపోయారు. దీంతో ఆయన పక్కనే ఉన్న వ్యాన్ ఎక్కి ప్రసంగించారు. ఈ సందర్భంగా పోలీసులపై ఆయన నిప్పులు చెరిగారు. 
 
దొంగల్లా తన ప్రచారా రథాన్ని హైజాక్ చేసిన మీరు పోలీసులా లేక దొంగలా? అంటూ ప్రశ్నించారు. తన హయాంలో పోలీసులు తీవ్రవాదుల అంతు చూశారని ఇపుడు పోలీసులు ప్రచార రథాలను హైజాక్ చేసే స్థాయికి దిగజారిపోయారంటూ విమర్శించారు. 
 
తాను కేవలం ఒక్క రాష్ట్ర ప్రజల కోసమే కాకుండా పోలీసు కుటుంబాలు, వారి పిల్ల కోసం కూడా పోరాడుతున్నానని, ఒక సైకో ముఖ్యమంత్రి మెడపై కత్తిపెట్టి చేయమంటేనే పోలీసులు చేస్తున్నారని, వారి బానిసత్వాన్ని చూస్తే జాలేస్తుందని అన్నారు. 
 
దీనికి కారణం సైకో జగన్ రెడ్డికి ఓడిపోతామనే భయం పట్టుకుందని, అందుకే నల్ల జీవోలతో విపక్షాలను అణిచి వేయాలని చూస్తున్నారని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారనీ, వాళ్లు తలచుకుంటే గుడ్డలు ఊడదీసి నిలబెడతారని హెచ్చరించారు. వైఎస్. వివేకా హత్య కేసులో జగన్ రెడ్డికి శిక్షపడటం ఖాయమని అన్నారు. గొడ్డలి వేటుతో లేపేసి గుండెపోటు అంటూ అబద్ధపు ప్రచారం చేశారని చంద్రబాబు 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments