Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహితుడు.. కానీ 17 ఏళ్ల యువతితో ప్రేమాయణం.. పురుగుల మందు తాగేశారు..

అతనికి పెళ్లైంది. కానీ 17ఏళ్ల యువతితో అక్రమ సంబంధం నెరపాడు. కానీ ఇంతలో ఏమైందో ఏమోకానీ ప్రేయసితో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా త

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (11:45 IST)
అతనికి పెళ్లైంది. కానీ 17ఏళ్ల యువతితో అక్రమ సంబంధం నెరపాడు. కానీ ఇంతలో ఏమైందో ఏమోకానీ ప్రేయసితో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామానికి చెందిన జొన్నలగడ్డ తిరుపతిరావు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.. అతనికి నాలుగేళ్ల క్రితం వివాహం కాగా.. అతనికి మూడేళ్ల కుమారుడు వున్నాడు. 
 
ఈ క్రమంలో ఇతనికి తన స్వగ్రామానికి చెందిన శ్రీలక్ష్మీ అనే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వద్దని పెద్దలు వారించినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం తిరుపతిరావు, శ్రీలక్ష్మీ గ్రామంలో కనిపించలేదు. వీరిద్దరూ పారిపోయారని భావించిన తిరుపతిరావు భార్య తిరువూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు వారిని సంప్రదించి.. స్టేషన్‌కు కౌన్సెలింగ్‌కు రావాల్సిందిగా పిలిచారు. ఇద్దరూ ఓ స్నేహితుడి బైకుపై తిరువూరు నుంచి ఖమ్మం జిల్లా పెనుబల్లి వద్దకు చేరుకుని నీలంద్రేశ్వర స్వామి ఆలయం వద్ద చేరుకుని.. పురుగుల మందు తాగేశారు. 
 
అంతేగాకుండా బైకుపై వెళ్తూ మందాలపాడు వద్ద స్పృహ కోల్పోయి పడిపోయారు. వారిని సమీపం నుంచి వెంబడించిన మిత్రుడు స్పృహ తప్పిపడి పోయిన వారిద్దరిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే వీరిద్దరూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments