Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రేయ్.. నీ అయ్య... నా కారునే ఆపుతారా'.. ఖాకీలపై యువతి బూతు పురాణం

పీకల వరకు మద్యం సేవించిన ఓ యువతి హైదరాబాద్ నగర పోలీసులకు బూతు పురాణం వినిపించింది. కొద్దిగా తాగి కారు డ్రైవింగ్ చేసినంతమాత్రాన నడి రోడ్డుపై కారును ఆపేస్తార్రా.. మీకెంత ధైర్యం అంటూ ఆ యువతి నోటికిష్టమొచ

Webdunia
శనివారం, 6 అక్టోబరు 2018 (09:20 IST)
పీకల వరకు మద్యం సేవించిన ఓ యువతి హైదరాబాద్ నగర పోలీసులకు బూతు పురాణం వినిపించింది. కొద్దిగా తాగి కారు డ్రైవింగ్ చేసినంతమాత్రాన నడి రోడ్డుపై కారును ఆపేస్తార్రా.. మీకెంత ధైర్యం అంటూ ఆ యువతి నోటికిష్టమొచ్చినట్టు తిట్ల దండకం చదివేసింది. దీంతో ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
 
హైదరాబాద్ నగరంలో పోలీసులు తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్‌ చేపట్టారు. ఇందులో మగవారితో పాటు మహిళలు కూడా పీకలదాకా మద్యం సేవించి వాహనాలు డ్రైవింగ్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 10లో పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ యువతి ఫుల్‌గా మద్యం సేవించి కారు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కింది. 
 
అయితే తన కారును ఆపడంపై ఆ యువతి పోలీసులపై విరుచుకుపడింది. 'నా కారునే ఆపుతారా' అంటూ ట్రాఫిక్ పోలీసులపై బూతుపురాణం మొదలుపెట్టింది. ఆ యువతితో పాటు కారులో ఉన్న ఓ వ్యక్తి, మరో ఇద్దరు యువతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరికి లా అండ్ ఆర్డర్ పోలీసుల వచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ యువతిపై కేసు నమోదు చేసిన పోలీసులు కారును సీజ్ చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments