Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా చావుకు ఆ వ్యక్తే కారణం అమ్మా.. నీవు జాగ్రత్త : కొడుకు సూసైడ్

ఓ వ్యక్తి తన తల్లిని వేధిస్తున్నాడనీ ఓ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పైగా, నీవు జాగ్రత్త అమ్మా అంటూ ఆ కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని రామకృష్ణాపురం గ్

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (09:35 IST)
ఓ వ్యక్తి తన తల్లిని వేధిస్తున్నాడనీ ఓ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పైగా, నీవు జాగ్రత్త అమ్మా అంటూ ఆ కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
రామకృష్ణాపురం గ్రామానికి చెందిన రెడ్డెబోయిన లచ్చయ్య, రాణి దంపతులు. వారికి ముగ్గురు పిల్లలు. 16 ఏళ్ల క్రితం లచ్చయ్య మృతిచెందడంతో రాణి మరో పెళ్లి చేసుకోకుండా పిల్లల కోసం జీవిస్తూ వస్తోంది. వ్యవసాయం చేస్తూ తన ఇద్దరు కుమారులను, కుమార్తెను చదివిస్తోంది. పెద్ద కుమారుడు రెడ్డెబోయిన రాజశేఖర్‌(24). డిగ్రీ మొదటి సంవత్సరం చదువును మధ్యలోనే ఆపేసి, తల్లికి వ్యవసాయంలో సహాయంగా ఉంటున్నాడు.
 
అయితే, అదే గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి రాణిపై మనసుపడి లైంగిక కోర్కె తీర్చాలంటూ గత ఐదేళ్లుగా వేధిస్తున్నాడు. ఇదే విషయంపై అతనితో గొడవ కూడా జరిగింది. అయినా వెంకటేశ్వర్లు ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రాజశేఖర్ శనివారం ఉదయం తల్లితో కూడా వాగ్వాదానికి దిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. రాత్రయినా కూడా అతడు తిరిగి రాకపోవటంతో కుటుంబీకులు అన్నిచోట్ల వెతికారు. ఆచూకీ దొరకలేదు.
 
ఆదివారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోగల వ్యవసాయ భూమిలో పురుగు మందు తాగి, ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ సూసైడ్‌ నోట్‌ దొరికింది. స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారమిచ్చారు. సూసైడ్‌ నోట్‌లో 'నా చావుకు కారణం.. పిట్టల వెంకటేశ్వర్లు సన్నాఫ్‌ సత్యనారాయణ' అని ఉంది. తన కుమారుడి ఆత్మహత్యకు పిట్టల వెంకటేశ్వర్లు వేధింపులే కారణమంటూ కారేపల్లి పోలీసులకు తల్లి రాణి ఫిర్యాదు చేసింది. కేసును ఎస్‌ఐ కిరణ్‌ కుమార్‌ దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం