Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సుల్లో వైఫై సేవలు... గంట పాటు ఫ్రీ, ఆ పై రూ. 10..!

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (09:25 IST)
ప్రైవేటు రవాణా సంస్థల పోటీకి ధీటుగా ప్రభుత్వ రవాణా సంస్థ కూడా ఆర్టీసీ బస్సుల్లో అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది. ఆర్టీసీ ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ వైఫై సౌకర్యం కల్పించనుంది. ఈ 'వైఫై' సౌకర్యం ఏప్రిల్ 1 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో అందుబాటులోకి రానుంది. 
 
ఈ సౌకర్యం విజయవాడ నుంచి ప్రారంభమై, హైదరాబాదు, విశాఖపట్టణం, తిరుపతి, బెంగళూరు నగరాలకు రాకపోకలు సాగించే వెన్నెల, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో అందుబాటులో ఉంచనుంది. ఆ తర్వాత దీనిని నెమ్మదిగా విశాఖపట్టణం, గుంటూరు, తిరుపతి కేంద్రాలుగా నడిచే బస్సులకు విస్తరించాలని ఆర్టీసీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ అత్యాధునిక సౌకర్యం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకులు గంటపాటు వైఫై సేవలను ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటును ఆర్టీ కల్పిస్తోంది. తరువాత 10 రూపాయలు చెల్లిస్తే గమ్యం చేరేవరకు ఎంతసేపైనా వైఫై వినియోగించుకోవచ్చని ఆర్టీసీ తెలిపింది. 
 
ఆ ప్రకారం వైఫై కోసం బస్సులో ఓ కంప్యూటర్, వైఫై పరికరం అందుబాటులో ఉంటాయట. ఈ కంప్యూటర్ లో 50 సినిమాలు, 400 వీడియో పాటలు అందుబాటులో ఉంచుతారట. వీటిని వారివారి మొబైల్, ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్, ఐప్యాడ్ లలో వీక్షించుకోవచ్చని ఆర్టీసీ చెబుతోంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments