Webdunia - Bharat's app for daily news and videos

Install App

61 రోజులపాటు సముద్ర జలాల్లో చేపల వేటకు నిషేధం..ఏపీ మత్స్యశాఖ

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (11:23 IST)
ఈ నెల 15 వ తేదీ నుంచి జూన్‌ 14 వ తేదీ వరకు మొత్తం 61 రోజులపాటు దేశవ్యాప్తంగా సముద్ర జలాల్లో సముద్ర ఉత్పత్తుల వేటను పూర్తిగా నిషేధించనున్నారు. చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల వేటను నిషేధిస్తున్నట్లు ఏపీ మత్స్యశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత 2020-21 సీజన్‌ ఈనెల 15 వ తేదీతో ముగియనుంది.
 
మత్స్యశాఖ ఇన్‌ఛార్జి జెడి పి.లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఎపి మెరైన్‌ ఫిషింగ్‌ (రెగ్యులైజేషన్‌) చట్టం 1994 ప్రకారం.. నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నామన్నారు. మత్స్యరాశుల సమర్థ యాజమాన్య చర్యల్లో భాగంగా.. ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నామన్నారు. 
 
నిషేధ సమయంలో ఎవరైనా సముద్రంలో వేట సాగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, బోట్లు, మత్స్య ఉత్పత్తులను సైతం సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఈ నిషేధ ఆంక్షలను రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు పర్యవేక్షించనున్నారు. 
 
నిషేధిత సమయంలో చిరుచేపలు, రొయ్యల ఉత్పత్తి పెద్ద ఎత్తున జరగనుంది. 61 రోజులపాటు మత్స్యవేటను నిలిపివేస్తే తరువాత దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని మత్స్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments