రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సొంతూరిలో వైసిపి గెలుపు

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (10:33 IST)
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ సొంతూరిలో వైసిపి గెలుపొందింది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల గ్రామంలో సర్పంచ్‌, ఆయన ఇల్లు ఉన్న వార్డులో కూడా వైసిపి అభిమానులు గెలుపొందారు.

గ్రామ సర్పంచ్‌ పదవిని బాలావర్తు కుషీబాయి 1,169 ఓట్ల భారీ మెజారిటీతో గెల్చుకున్నారు. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ సొంత వార్డులో వైసిపి అభిమాని ఆత్మకూరు నాగేశ్వరరావు భారీ మెజార్టీతో గెలుపొందారు.

ఇక్కడ మొత్తం 490 ఓట్లు పోలవగా నాగేశ్వరరావుకు 256 ఓట్లు వచ్చాయి. టిడిపి మద్దతుదారుకు 145 ఓట్లు పోలయ్యాయి.

కడపలో...
కడపలోని తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు కౌంటింగ్‌ పూర్తయింది. చిత్తా రవి ప్రకాష్‌ రెడ్డి 759 ఓట్ల మెజారిటీతో రంగసముద్రం పంచాయితీ సర్పంచ్‌ గా గెలుపొందారు.

మొదటి దశలో 206 స్థానాలకుగాను.. వైసిపి 177, టిడిపి 25, ఇతరులు.. 2 స్థానాలను చేజిక్కించుకున్నాయి. 1.ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె 2.పొరుమామిల్ల టౌన్‌ రెండు పంచాయతీల్లో కౌంటింగ్‌ కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments