Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కాంగ్రెస్ సర్కారు కూలిపోవడం తథ్యం : వైకాపా ఎంపీ జోస్యం

ఠాగూర్
మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (09:54 IST)
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం తథ్యమని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్బంగా రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా విభజన చేసిందన్నారు. తెలంగాణ ఇచ్చాం... రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తామని ఆశించిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు కర్రుకాల్చివాత పెట్టారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పలేదని ఎద్దేవాచేశారు. పదేళ్లపాటు నానా బాధలు పడిన కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు అనేక అబద్ధాలు చెప్పి తెలంగాణాలోకి అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే, తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని, త్వరలోనే కుప్పకూలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలిట అసలు విలన్ కాంగ్రెస్ పార్టీయేనని, ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చెప్పారని, కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధివుండివుంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశానికి ఎందుకు చోటు కల్పించలేదన్నారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడం చేతగాని కాంగ్రెస్ పార్టీ... ఇపుడు తమను ఎందుకు నిందిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. కానీ, ఎన్నికలు వస్తుండటంతో దీనిని ఒక ప్రచార అస్త్రంగా ఎంచుకుందని నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

ధర్మం కోసం జితేందర్ రెడ్డి ఏం చేశాడు.. రివ్యూ

మట్కా లో అదే నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది : జివి ప్రకాష్ కుమార్

ఐఫా వేడుకల్లో తేజ సజ్జా - రానా కామెంట్స్.. సారీ చెప్పాలంటూ మహేశ్ ఫ్యాన్స్ డిమాండ్...

ఘాటి నుంచి అనుష్క శెట్టి స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రివీల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments