రాష్ట్ర మహిళల పాలిట నరకాసురుడు.. బాబును ఇంకెవ్వరితో పోల్చాలి.. రోజా ఫైర్

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (14:14 IST)
డ్వాక్రా మహిళలను నిండా ముంచేసిన ఏపీ సీఎం చంద్రబాబు, రాష్ట్ర మహిళల పాలిట నరకాసురుడేనని వైకాపా మహిళా నేత రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్‌తో సంబంధమున్న తెలుగుదేశం నేతలను వెనకేసుకుని వస్తూ, ఇసుక దందాను ప్రశ్నించిన మహిళా అధికారులను కాళ్లతో తన్నిన ఎమ్మెల్యేను కాపాడుకుంటూ వస్తున్న చంద్రబాబునాయుడిని నరకాసురుడితో కాకుండా ఇంకెవరితో పోల్చాలని రోజా ప్రశ్నించారు. 
 
ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ల అక్రమ రవాణాలో దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరిందని, ఇది కూడా చంద్రబాబు ఘనతేనని ఎద్దేవా చేశారు. ఇంకా గురువారం రోజా మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించిన 600 హామీలను అమలు చేయడంలో విఫలమైందని చెప్పారు. అలాంటి పార్టీకి ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. మహిళలను అప్పుల పాలు చేసిన చంద్రబాబును, శూర్పణకల వంటి మహిళా మంత్రులు మాత్రమే దేవుడంటున్నారని విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం