Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబును ''ఫాదర్ ఆఫ్ బెల్ట్ షాప్'' అని పిలుస్తున్నారు.. రోజా ఎద్దేవా

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు.. ఐదు సంత‌కాలు పెట్టార‌ని గుర్తు చేశారు. ఇందులో 2014 జూన్‌లో

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (13:57 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు.. ఐదు సంత‌కాలు పెట్టార‌ని గుర్తు చేశారు. ఇందులో 2014 జూన్‌లోనే బెల్టు షాపులు ఉండ‌నివ్వ‌మ‌ని సంత‌కం పెట్టిన చంద్ర‌బాబు ఇన్నేళ్ల‌యినా వాటిని అరికట్టలేకపోయారన్నారు. చంద్ర‌బాబు ఫాద‌ర్ ఆఫ్ బెల్ట్ షాప్ అని అందరూ అంటున్నట్లు రోజా ఎద్దేవా చేశారు. 
 
చంద్ర‌బాబు పెట్టిన ఐదు సంత‌కాల్లో నాలుగు దిక్కులేకుండా పోయాయని విమ‌ర్శించారు. రైతుల‌కు, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు పూర్తి స్థాయిలో రుణ‌మాఫీ జ‌ర‌గ‌లేద‌ని అన్నారు. అప్ప‌ట్లో వైస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మాత్రం ప్ర‌మాణ స్వీకారం కాగానే సంత‌కాలు చేసి, వాటిని వెంట‌నే స‌మ‌ర్థంగా అమ‌లుప‌రిచారని గుర్తు చేశారు. 
 
పింఛన్ల విషయంలో వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రకటించుకున్నారని.. ఎంతోమందిని మోసం చేశారని రోజా విమర్శించారు. చంద్ర‌బాబు నాయుడి సొంత నియోజ‌క వ‌ర్గం కుప్పంలోనూ పింఛ‌న్లు ఇవ్వ‌డం లేదన్నారు. రూ.5లకే అన్నం పెడ‌తామ‌న్నారని, అదీ కూడా లేదని రోజా ఫైర్ అయ్యారు. దీన్ని బ‌ట్టే చంద్ర‌బాబు ఎంత అస‌మ‌ర్థుడో పూర్తిగా అర్థం చేసుకోవ‌చ్చ‌ని విమర్శించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments