Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యం.. అవినీతిలో బాబే సీనియర్: ఏకిపారేసిన రోజా

రాజకీయాల్లో తానే సీనియర్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా సెటైర్లు విసిరారు. అవినీతిలో సీఎం చంద్రబాబే సీనియర్ అని రోజా ఆరోపించారు. సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (13:33 IST)
రాజకీయాల్లో తానే సీనియర్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా సెటైర్లు విసిరారు. అవినీతిలో సీఎం చంద్రబాబే సీనియర్ అని రోజా ఆరోపించారు. సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యమనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. తన సీనియారిటీతో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఒరగబెట్టిందేమీ లేదని.. కానీ అవినీతిలో మాత్రం సీనియారిటీని బాగా ఉపయోగించుకున్నారని విమర్శించారు. 
 
ఎన్నికల ప్రచారంలో 15 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు ప్రస్తావించిన విషయం నిజమా? కాదా? అని రోజా ప్రశ్నించారు. అవాస్తవాలతో కూడిన అభివృద్ధి రేటును చూపిస్తూ కేంద్రాన్ని కూడా చంద్రబాబు తప్పుదారి పట్టిస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడుతున్నారని రోజా అన్నారు. 
 
హైదరాబాదులో రోజా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా వల్ల ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు అసెంబ్లీలో రెండు సార్లు ఎందుకు తీర్మానం చేశారని ప్రశ్నించారు. హోదా వల్ల ఎలాంటి ప్రయోజ నాలున్నాయో ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లకు వెళ్తే తెలుస్తుందని, ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టిన సుజనా చౌదరి, సిఎం రమేష్‌లను అడిగినా చెబుతారని ఎద్దేవా చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments