తిరుమలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు.. సిఫార్సు లేఖతో 54 మందికి వీఐపీ బ్రేక్ దర్శనం

వరుణ్
శుక్రవారం, 28 జూన్ 2024 (12:47 IST)
గత ప్రభుత్వంలో మంత్రులు, అధికార పార్టీ నేతలు తిరుమలను తమ అడ్డాగా చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను నిజం చేస్తూ వీరు చేసిన అక్రమాలు ఇపుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వం తితిదే పవిత్రతను ఉద్దేశ్యపూర్వకంగా దెబ్బతీసిందని భక్తలు ఆరోపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీనికితోడు, వైకాపా మంత్రులు ఇష్టానుసారంగా సిఫార్సు లేఖలతో అనేక మందిని వీఐపీ బ్రేక్ దర్శనానికి పంపించారు. 
 
ముఖ్యంగా, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన మంత్రులు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకే లేఖపై ఏకంగా 54 మందికి దర్శనం కల్పించాకరు. దీనికి సంబంధించిన లేఖ ఒకటి ఇపుడు వెలుగులోకి వచ్చింది. తాను పంపిన వారిని దర్శనానికి అనుమతించాలంటూ అప్పటి తితిదే ఈవో ధర్మారెడ్డికి మంత్రి పెద్దిరెడ్డి రాసిన సిఫార్సు లేఖను తెలుగుదేశం పార్టీ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. 
 
తిరుమలలో వైకాపా పెద్దలు యధేఛ్చగా దందాలు చేశారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో పెద్దిరెడ్డి ఒకేసారి 54 మందిని పంపించాలని రాసిన సిఫార్సు లేఖ ఇదేనని పేర్కొంది. ఈ బ్రేక్ దర్శనం స్కాంతో పాటు శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్ కుంభకోణంపైనా తితిదే విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం మంత్రి పెద్దిరెడ్డి రాసిన సిఫార్సు లేఖ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments