Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీకి రాజీనామా చేసిన యనమల కృష్ణుడు!!

వరుణ్
శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (16:27 IST)
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసారు. గత నాలుగు దశాబ్దాలకు పైగా టీడీపీలో కొనసాగిన ఆయన శుక్రవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 42 యేళ్లు టీడీపీ కోసం పాటుపడ్డానని, తనను దూరం పెట్టాలని కొందరు దురుద్దేశ్యంతో పని చేశారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మారడం బాధగా ఉన్నా తప్పడం లేదన్నారు. సీఎం జగన్ ఆహ్వానం మేరకు వైకాపాలో చేరబోతున్నట్టు తెలిపారు. 
 
కాకినాడ జిల్లాలో యనమల బ్రదర్స్‌ టీడీపీకి అత్యంత కీలక నేతలుగా చెలామణి అవుతున్న విషయం తెల్సిందే. కొంతకాలంగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి, తమ్ముడు యనమల కృష్ణుడికి మధ్య విభేదాలు నెలకొనివున్నాయి. గత 2014, 2019లో తుని నుంచి పోటీ చేసిన యనమల కృష్ణుడు ఓడిపోయారు. ఈసారి తుని టికెట్‌ను టీడీపీ హైకమాండ్ యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు ఇచ్చారు. దీంతో మనస్తాపం చెందిన కృష్ణుడు ఇపుడు ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments