Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్లుల్ని సెలెక్ట్‌ కమిటీకి పంపితే సర్కార్‌కు ఉలుకెందుకు..?

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (08:30 IST)
వైకాపా ప్రభుత్వం అధికారులను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోవాలని తెదేపా నేత యనమల రామకృష్ణుడు సూచించారు. బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపితే ప్రభుత్వానికి అంత ఉలుకెందుకని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయానికి భయపడుతున్నారా అంటూ ప్రశ్నించారు.

వైకాపా ప్రభుత్వం తెదేపాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అధికారులను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోవాలని సూచించారు.

గత కౌన్సిల్‌లో జరిగిన ఘటనలు అందరికీ తెలిసినవేనన్న యనమల... అసెంబ్లీ నుంచి వచ్చిన బిల్లులను కౌన్సిల్‌ పరిశీలించే అవకాశం ఉందన్నారు.

రాజ్యసభకు ఉన్నట్లే రాష్ట్రాల్లో మండలికి కూడా అధికారాలు ఉంటాయని ఆయన గుర్తు చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన బిల్లులపై మాట్లాడటం తప్పా అంటూ ప్రశ్నించారు. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తే ప్రభుత్వానికి భయమెందుకు? అన్నారు.

తాము బిల్లులను అడ్డుకోలేదని సెలెక్ట్‌ కమిటీకి మాత్రమే పంపామని స్పష్టం చేశారు. ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుని క్రోడీకరించడం తప్పా? అని నిలదీశారు.

మండలి ఛైర్మన్‌ ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా తప్పుబడతారా? అని మండిపడ్డారు. మండలి ఛైర్మన్‌పై ప్రివిలైజ్‌ నోటీసు ఇస్తారని తెలిసిందన్న యనమల... ఆ అధికారం ఉంటుందా? అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments