Webdunia - Bharat's app for daily news and videos

Install App

15, 16 తేదీల్లో స్త్రీ, పురుష విభాగాల‌లో మ‌ట్టికుస్తి పోటీలు

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (08:10 IST)
ఈ నెల 15, 16 తేదీల్లో కృష్ణాజిల్లా ఇండియన్ స్టైల్ రెస్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఇండియన్ స్టైల్ 
రెస్టింగ్ అసోసియేషన్ సహకారంతో, సిబిఅర్ స్పోర్ట్స్ అకాడమీ సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ ఇండియన్ స్టైల్ రెస్లింగ్ (మట్టికుస్తి), సీనియర్ అండ్ జూనియర్ ఛాంపియన్ షిప్ మెన్ అండ్ ఉమెన్ విభాగాలలో పోటీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు 
ఏపి ఇండియన్ స్టైల్ రెస్లింగ్ అసోసియేషన్ ప్ర‌ధాన కార్యదర్శి అర్జా పాండురంగారావు తెలిపారు.

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిబిర్ స్పోర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు సిబిఅర్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కె.పి.రావు, ఆంధ్రప్రదేశ్ ఇండియన్ స్టైల్ రెస్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బోనాల సంతోష్‌కుమార్, కోశాధికారి జి.భూషణంతో క‌లిసి ఆయ‌న మాట్లాడారు.

కేతనకొండ‌లోని సిబిఅర్ స్పోర్ట్స్ అకాడమీ గ్రౌండ్స్‌లో పోటీలు జరుగుతాయ‌న్నారు. సీనియర్ విభాగంలో 20 సంవత్సరాలు వయస్సు పైబడిన వారు, జూనియర్స్ విభాగంలో 18 నుండి 20 సంవత్సరాల వారు పోటీల్లో పాల్గొనేందుకు అర్హుల‌ని తెలిపారు.

సీనియర్ మరియు జూనియర్స్ విభాగాలలో పురుషుల వెయిట్ క్యాట‌గిరి కేజీల్లో 52, 57, 61, 65, 74, 86, 97 ఓపెన్ ఛాలెంజ్ 90 నుండి 120, స్త్రీలు విభాగంలో 50, 55, 59, 62, 65, 68, 76 ఓపెన్ ఛాలెంజ్ 65 నుండి 80 అని పేర్కొన్నారు. పురుషులు విభాగంలో ఆంధ్రకేసరి టైటిల్ పోటీలు కూడా నిర్వహించనున్న‌ట్లు చెప్పారు.

ఈ పోటీల్లో మొదటి స్థానం సాధించిన విజేతకు గదను బహుకరించడం జ‌రుగుతుంద‌న్నారు. పోటిల్లో పాల్గొనే అన్ని జిల్లా సంఘాలు వారి క్రీడాకారుల వయస్సు దృవీకరణ పత్రాల‌తో ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు సిబిర్ స్పోర్ట్స్ అకాడెమీలో సంప్ర‌దించాల‌ని కోరారు.

14వ తేదీ సాయంత్రం నుండి 16వ తేదీ సాయంత్రం వరకు భోజన, నివాస వసతి సదుపాయాల‌ను క్రీడాప్రాంగణంలో నిర్వహణ కమిటి వారిచే ఏర్పాటు చేయడం జ‌రుగుతుంద‌న్నారు. అదే రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు బరువులు తీయబడ‌తాయ‌ని తెలిపారు. మరుసటి రోజు ఉదయం నుండి పోటీలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments