Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యంకు డబ్బు లేదని శానిటైజర్లు తాగిన మహిళల మృతి

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (16:10 IST)
అసలే కరోనా కష్టకాలం. చిత్తు కాగితాలు ఏరితే తప్ప జీవనం సాగదు. అందులోను తిండితో పాటు మద్యానికి బానిసైన ఒక కుటుంబం శానిటైజర్లు తాగడం అలవాటుగా మార్చుకుంది. నీళ్లలో శానిటైజర్లు వేసుకుని తాగడం అలవాటు చేసుకున్న ఆ కుటుంబం చివరకు మత్తు ఎక్కువ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయారు.
 
తిరుచానూరు సరస్వతినగర్‌కు చెందిన మల్లిక, లత, సెల్వంలు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరు గత కొన్ని సంవత్సరాలుగా తిరుచానూరు చుట్టుప్రక్కల చెత్త కాగితాలు ఏరుకుని జీవనం సాగించేవారు. కరోనా సమయంలో మూడు నెలల పాటు పోషణ కరువై ఇబ్బందులు పడ్డారు.
 
అయితే గత వారంరోజుల నుంచి చెత్త ఏరుకుని వచ్చిన డబ్బుతో కుటుంబం నడిచేది. దాంతో పాటు మద్యానికి బానిసయ్యారు వీరు ముగ్గురు. డబ్బులు సరిపోకపోవడంతో గత మూడురోజుల నుంచి శానిటైజర్‌ను నీళ్లలో కలుపుకుని తాగారు. మొదటి రెండురోజులు బాగానే ఉన్నా నిన్న రాత్రి శానిటైజర్లలోని రసాయానాల వల్ల మత్తు ఎక్కువై అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు.
 
అయితే ఈ రోజు ఉదయం కొంతమంది స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా అప్పటికే ముగ్గురు మరణించారు. మార్చురీకి మృతదేహాలను తరలించి పంచనామా నిర్వహిస్తున్నారు తిరుచానూరు పోలీసులు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments