Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరగతి గదిలో పొడిచి.. పొడిచి.. ఉపాధ్యాయురాలి హత్య.. హంతకుడు కూడా టీచరే..

చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఓ టీచర్ దారుణ హత్యకు గురైంది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన పాఠశాలలో రక్తం పారింది. తరగతి గదిలోనే చిన్నారుల కళ్ల ముందే ఓ ఉపాధ్యాయురాలిని తోటి ఉపాధ్యాయుడే అతి దారుణంగా పొడిచ

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (11:14 IST)
చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఓ టీచర్ దారుణ హత్యకు గురైంది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన పాఠశాలలో రక్తం పారింది. తరగతి గదిలోనే చిన్నారుల కళ్ల ముందే ఓ ఉపాధ్యాయురాలిని తోటి ఉపాధ్యాయుడే అతి దారుణంగా పొడిచి పొడిచి హత్య చేశాడు. 
 
ఈ సంఘటనతో భీతావహులైన పిల్లలు తలోదిక్కుకూ పరుగులు తీశారు. ఈ దారుణ సంఘటన గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ మబ్బువాళ్లపేట పాఠశాలలో గురువారం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే ఈ పాఠశాలలో ప్రేమకుమారి, గంగాపురం పాఠశాలలో చంద్రమౌళి అనే ఇద్దరు టీచర్లు పని చేస్తున్నారు. వీరిమధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం జరుగుతున్నట్టు సమాచారం. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల ప్రేమకుమారి ఇతరులతో చనువుగా ఉంటోంది. దీన్ని జీర్ణించుకోలేని చంద్రవౌళి గురువారం పాఠశాలలోనే ఆమెపై కత్తితో దాడి చేసి విచక్షణా రహితంగా పొడిచి పొడిచి చంపాడు. గతంలోనూ వీరిద్దరికీ గొడవలు జరిగాయని, ఇటీవల వీరు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారని తెలిసింది.
 
కాగా, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... వీరిద్దరూ వివాహితులే కావడం గమనార్హం. ప్రేమ కుమారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త హెల్త్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుడు చంద్రవౌళి గతంలో రియల్ ఎస్టేట్, ఇసుక, ట్రాన్స్‌పోర్టు వ్యాపారాలు నిర్వహిస్తుండేవాడు. కేవలం తన ప్రేయసి కోసం భార్యకు విడాకులు ఇచ్చారని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments