Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు హైదరాబాద్‌లో ఉద్యోగం.. ఇంట్లో భార్య... కోడలిని కోర్కెతీర్చమన్న మామ....

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో మామ పెట్టిన లైంగిక వేధింపులకు ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. జనగామ జిల్లా గుండాల మండలం నూనెగూడెం గ్రామంలో జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే...

Webdunia
బుధవారం, 26 జులై 2017 (12:23 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో మామ పెట్టిన లైంగిక వేధింపులకు ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. జనగామ జిల్లా గుండాల మండలం నూనెగూడెం గ్రామంలో జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం మొరారిపల్లి చెందిన అనుముల మల్లారెడ్డి, రాధ దంపతుల కూతురు మాధవిని సుమారు ఏడేళ్ల క్రితం జనగామ జిల్లా గుండాల మండలం నూనెగూడెం గ్రామానికి చెందిన అండెం సత్తిరెడ్డి, స్వరూప దంపతుల కుమారుడు నర్సిరెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 
 
కాపురం సజావుగా సాగుతుండగా సుమారు రెండు నెలల క్రితం భర్త నర్సిరెడ్డి భార్యాపిల్లలను స్వగ్రామంలోనే వదిలి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వెళ్లి ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య మాధవి ఇంటి వద్దే ఉంటూ పిల్లలతో పాటు అత్తమామల బాగోగులు చూసుకుంటూ వచ్చింది.
 
ఈ క్రమంలో కోడలిపై కన్నేసిన మామ... ఆమెను కోర్కె తీర్చమని వేధిస్తూ వచ్చాడు. అలాగే, అత్త కూడా సూటిపోటి మాటలతో వేధిస్తూ వచ్చింది. అత్తామామ వేధింపులనను తాళలేక ఆ మహిళ శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. మృతురాలి తల్లి రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లపై పొంగల్ సాంగ్

అజిత్ కుమార్, త్రిష మూవీ విడాముయర్చి నుంచి లిరిక‌ల్ సాంగ్

డ్రీమ్ క్యాచర్ ట్రైలర్ చూశాక నన్ను అడివిశేష్, రానా తో పోలుస్తున్నారు : ప్రశాంత్ కృష్ణ

క్రిస్మస్ సెలవులను ఆస్వాదిస్తున్న సమంత.. వినాయక పూజ..?

3 సినిమాతో తన కెరీర్ ముదనష్టం అయ్యిందంటున్న శ్రుతి హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం