Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త శవంతో మూడు రాత్రులు గడిపిన భార్య! ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (15:00 IST)
అసలే కరోనా మహమ్మారి. ఇలాంటి సమయంలో సాధారణంగా చనిపోయినా కరోనా వైరస్‌తోనే చనిపోయారనే భయం పీడిస్తోంది. అందుకే సొంత కన్నతల్లిదండ్రులు చనిపోయినా, కన్నబిడ్డలు, తోబుట్టువులు, బంధువులు ఇలా ఏ ఒక్కరూ శవం సమీపానికి కూడా రావట్లేదు. అందుకేనేమో ఆ భార్య భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకుని మూడు రోజుల ఒంటరిగా ఉండిపోయింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిజామాబాద్ జిల్లా కొత్త హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన లింగా రెడ్డి అనే వ్యక్తి వృద్దాప్య సమస్యలతో మూడు రోజుల క్రితం చనిపోయాడు. ఈ విషయం మతిస్థిమితంలేని ఆయన భార్య శకుంతలకు తెలియదు. 
 
అలా మూడు రోజులపాటు గడిచిపోయింది. అయితే, లింగారెడ్డి ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని ఇరుగుపొరుగువారు గుర్తించి  ఇంట్లోకి వెళ్లి చూడగా లింగారెడ్డి చనిపోయివున్నాడు. దీంతో పోలీసులకు సమాచారం చేరవేయగా, వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ లింగారెడ్డి కుమారుడు హైదరాబాద్‌లో ఉండగా, కుమార్తె మాత్రం ఇంగ్లండ్‌లో నివసిస్తోంది. వీరికి పోలీసులే తండ్రి చనిపోయిన విషయాన్ని చేరవేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

కార్మికులకు వేతనాలు పెంచే అవకాశం లేదు : మైత్రీ మూవీస్ నవీన్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments