Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు భార్యల కామాంధుడు.. కోడలిని రేప్ చేసి బిడ్డకు తండ్రయ్యాడు...

వాడో కామాంధుడు.. ఇప్పటికే ముగ్గురు భార్యలతో పడక సుఖం అనుభవిస్తున్నాడు. అయినప్పటికీ.. ఆ కామాధుడుకి కోర్కె తీరలేదు. దీంతో తండ్రి స్థానంలో ఉండాల్సిన మామ... కోడలిపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా అనుభవించాలని ప

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2017 (12:43 IST)
వాడో కామాంధుడు.. ఇప్పటికే ముగ్గురు భార్యలతో పడక సుఖం అనుభవిస్తున్నాడు. అయినప్పటికీ.. ఆ కామాధుడుకి కోర్కె తీరలేదు. దీంతో తండ్రి స్థానంలో ఉండాల్సిన మామ... కోడలిపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా అనుభవించాలని ప్లాన్ చేశాడు. అంతే, తన మూడో భార్య సహకారంతో మత్తుమందు ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈయన కారణంగానే కోడలు గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. ఇది జరిగి పదేళ్లయింది. అయితే తాజాగా కోడలికి అనుమానం వచ్చింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు.. బాబు, ఆ వృద్ధుని రక్తనమూనాలను డీఎన్ఏ పరీక్షలకు పంపారు. ఇద్దరు డీఎన్ఏ సరిపోవడంతో అత్త, మామలపై కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
 
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌లోని చిలకలగూడకు చెందిన బి.మోహన్‌దాస్‌(60) రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారు. మోహన్‌దాస్ ఉంటున్న ఇంట్లోనే మూడో అంతస్తులో ఆయన కుమారుడు, కోడలు నివశిస్తున్నాడు. కోడలిపై కన్నేసిన మోహన్‌దాస్‌.. మూడో భార్య భారతి సహకారాన్ని కోరాడు. ఆమె మత్తుమందు కలిపిన జ్యూస్‌ను కోడలుకు ఇచ్చేది. కోడలు మైకంలోకి జారగానే మామ వెళ్లి అత్యాచారం చేసేవాడు. అలా వీలు చిక్కినప్పుడల్లా భార్య సహకారంతో అత్యాచారం చేశాడు.
 
ఈ క్రమంలోనే కోడలు గర్భందాల్చి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొద్దిరోజులకు అత్తామామల వ్యవహారశైలిని పసిగట్టిన కోడలు.. ఓ రోజున తనకు జరిగిన దారుణాన్ని గ్రహించింది. అంతే, గత జులై 8వ తేదీన చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలుడి రక్తాన్ని తీసి డీఎన్‌ఏ పరీక్షలకు పంపించారు. అతను మోహన్‌దాస్‌కే పుట్టాడని తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరించిన భారతిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments