Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాబిస్తానని రప్పించి.. జ్యూస్ ఇచ్చాడు.. రేప్ చేసి.. నగ్న ఫోటోలు తీశాడు..

మహిళలూ.. ప్రకటనలు చూసి ఇంటర్వ్యూలకు వెళ్తున్నారా? అపాయింట్‌మెంట్ ఇస్తున్నాం.. కార్యాలయానికి రండి అంటే ఒంటరిగా వెళ్తున్నారా? అయితే ఇక జాగ్రత్త పడండి. కొత్త ప్రాంతాల్లో ఇచ్చే ఆహార పదార్థాలను, జ్యూస్‌లను

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2017 (12:01 IST)
మహిళలూ.. ప్రకటనలు చూసి ఇంటర్వ్యూలకు వెళ్తున్నారా? అపాయింట్‌మెంట్ ఇస్తున్నాం.. కార్యాలయానికి రండి అంటే ఒంటరిగా వెళ్తున్నారా? అయితే ఇక జాగ్రత్త పడండి. కొత్త ప్రాంతాల్లో ఇచ్చే ఆహార పదార్థాలను, జ్యూస్‌లను తాగకండి. ఎందుకంటే..? ఉద్యోగం వచ్చిందని ఓ మహిళకి అపాయింట్‌మెంట్ ఆర్డర్ పంపి.. ఆమె ఆఫీసుకు వచ్చాక మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెం.10లో కేపీఆర్ ఐసీ అనే కంపెనీని రాజశేఖర రెడ్డి నడుపుతున్నాడు. ఈ సంస్థ ఇచ్చిన ప్రకటనను చూసిన 29 ఏళ్ల మహిళ.. దరఖాస్తు చేసుకుంది. ఇంటర్వ్యూ కూడా జరిగింది. ఇక ఇంటర్వ్యూలో ఆమె సెలెక్ట్ అయ్యిందంటూ.. ఉద్యోగం వచ్చిందని ఆఫీసుకు రావాల్సిందిగా లెటర్ పంపాడు రాజశేఖర రెడ్డి. దీన్ని నమ్మిన మహిళ జీతాలు గురించి మాట్లాడుకునేందుకు ఆఫీసుకు వెళ్లింది. 
 
ఆఫీసుకు వెళ్లాక ఆ మహిళకు గులాబ్ జామ్, జ్యూస్ ఇచ్చారు. కొద్ది సేపటికే మహిళ స్పహ తప్పిపడిపోవడంతో.. ఆమెపై ఆఫీసులోని తన గదిలో రాజశేఖర రెడ్డి అత్యాచారం చేశాడు. ఆపై నగ్న దృశ్యాలను ఫోటో తీశాడు. స్పృహ వచ్చిన తర్వాత తనకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం బయటికి చెప్తే నగ్న దృశ్యాలను నెట్లో పెడతానని బెదిరించినా.. బాధిత మహిళ తల్లిదండ్రులతో కలిసి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments