Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుప్త నిధుల వేటకు తీసుకెళ్లి ప్రియుడుతో కలిసి భర్తను చంపిన భార్య

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (16:30 IST)
హైదరాబాద్‌లో మరో వ్యక్తి కట్టుకున్న భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. గుప్త నిధుల పేరు చెప్పి వేటకు తీసుకెళ్లి తన ప్రియుడుతో కలిసి కట్టుకున్న భార్యే కడతేర్చింది. ఈ విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఏపీలోని నంద్యాల సమీపంలోని నూనెపల్లి ప్రాంతానికి చెందిన జక్కా చంద్రశేఖర్ (38) అనే దివ్యాంగుడుకి అదే ప్రాంతానికి చెందిన వరలక్ష్మి అనే మహిళతో 15 యేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయిన ఆర్నెల్లకే భర్తను తీసుకుని హైదరాబాద్‌కు చేరుకుంది. అక్కడే కూలినాలి చేసుకుంటూ జీవినం సాగిస్తూ వచ్చింది. 
 
ఈ క్రమంలో ప్రకాశం జిల్లా, గిద్దలూరుకు చెందిన వెంకట్‌రాం రెడ్డి సుల్తాన్‌బజార్‌ పీఎస్‌లో ట్రాఫిక్‌ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. స్వగ్రామానికి వెళ్లి వచ్చే క్రమంలో చంద్రశేఖర్‌, వరలక్ష్మి దంపతులకు రైలులో పరిచయమయ్యారు. ఈ పరిచయం కాస్త వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ విషయం తన ప్రియుడు వెంకటరెడ్డికి వరలక్ష్మి చెప్పింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి చంద్రశేఖర్‌ను హత్యచేయాలని నిర్ణయించుకున్నారు. చంద్రశేఖర్‌కు గుప్తనిధుల వేట వ్యాపకం ఉంది. దాన్ని ఆసరాగా చేసుకున్న హోం గార్డు గుప్తనిధుల కోసమంటూ తీసుకెళ్లి చంద్రశేఖర్‌ను హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు.
 
ఇందుకోసం విజయవాడకు చెందిన సమీప బంధువు నరేష్ రెడ్డిని తోడుగా పిలిపించుకున్నాడు. ముగ్గురూ కలిసి జనవరి 13న బైక్‌పై ఆగాపల్లి రిజర్వ్‌డ్‌ ఫారెస్ట్‌ ప్రాంతానికి వెళ్లారు. కొద్దిసేపు గుప్తనిధుల కోసమంటూ క్షుద్రపూజలు చేసిన తర్వాత మద్యం తాగారు. పథకం ప్రకారం చంద్రశేఖర్‌తో అతిగా మద్యం తాగించారు. ఆ తర్వాత వెంకట్‌ రాంరెడ్డి, నరేష్‌ మత్తులో ఉన్న అతడి ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అక్కడే ఫారెస్ట్‌ ట్రెంచ్‌ కోసం తీసిన గోతిలో పాతిపెట్టి వెళ్లిపోయారు. కొద్ది రోజులపాటు మిన్నకుండిపోయిన వరలక్ష్మి భర్త కనిపించడం లేదని గత నెల 23వ తేదీన అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా, పోలీసులు స్విచాఫ్‌ చేసి ఉన్న మృతుడి ఫోన్‌కాల్‌ డేటాను పరిశీలించారు. చంద్రశేఖర్‌ అదృశ్యమైన జనవరి 13వ తేదీన జరిపిన ఫోన్‌కాల్స్‌ సిగ్నల్స్‌ను ట్రేస్‌ చేయగా.. ఆగాపల్లి రిజర్వ్‌డ్‌ ఫారెస్ట్‌లో చూపించింది. చివరి ఫోన్‌‌కాల్‌ ఆధారంగా నిందితుడు వెంకట్‌ రాంరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడించారు. ఆ తర్వాత చంద్రశేఖర్ మృతదేహం పాతిపెట్టిన స్థలానికి నిందితులను తీసుకెళ్లి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత భర్త హత్య కేసులో సంబంధం ఉన్న భార్య వరలక్ష్మిని కూడా అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments