Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఎన్నారై భర్త సంసారానికి పనికిరాడు.. దాచిపెట్టి పెళ్లి చేశారు.. హైదరాబాద్ మహిళ ఫిర్యాదు

నా భర్త సంసారానికి పనికికాడు.. ఈ విషయాన్ని మా అత్తమామలు దాచిపెట్టి పెళ్లి చేశారు. పైగా, ఈ విషయాన్ని ఆమె పుట్టింటివాళ్లకు చేరవేయడంతో గృహ నిర్బంధంలో ఉంచి చిత్ర హింసలకు గురిచేశారంటూ ఓ మహిళ హైదరాబాద్ నగర

Webdunia
శనివారం, 18 మార్చి 2017 (11:53 IST)
నా భర్త సంసారానికి పనికికాడు.. ఈ విషయాన్ని మా అత్తమామలు దాచిపెట్టి పెళ్లి చేశారు. పైగా, ఈ విషయాన్ని ఆమె పుట్టింటివాళ్లకు చేరవేయడంతో గృహ నిర్బంధంలో ఉంచి చిత్ర హింసలకు గురిచేశారంటూ ఓ మహిళ హైదరాబాద్ నగర సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
స్విట్జర్లాండ్‌లో స్థిరపడిన యెల్లపెద్ది రవిశంకర్‌, జానకి దంపతుల కుమారుడు యెల్లపెద్ది ఆదిత్యతో హైదరాబాద్ నగరానికి చెందిన భవ్యకీర్తి (26)కి గత యేడాది అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత ఆదిత్యతో కలిసి భవ్యకీర్తి స్విట్జర్లాండ్‌ వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లాక ఆదిత్య సంసారానికి పనికిరాడనే విషయం ఆమెకు తెలిసింది.
 
దీంతో ఆమె తన భర్తతో పాటు అత్తామామలను నిలదీసింది. పైగా, ఇదే విషయాన్ని హైదరాబాద్‌లో ఉండే తమ తల్లిదండ్రులకు చేరవేసింది. దాంతో అత్తింటివారు భవ్యకీర్తిని వేధించడం ప్రారంభించారు. ఫోన్లు అందుబాటులో లేకుండా చేసి గృహనిర్బంధం చేశారు. దీనిపై భవ్యకీర్తి తల్లిదండ్రులు స్విట్జర్లాండ్‌ అధికారులతో మాట్లాడి బాధితురాలికి గృహనిర్బంధం నుంచి ఓ పోలీసు అధికారి సహాయంతో విముక్తి కల్పించి భారత్‌కు పంపించారు. 
 
దీనిపై హైదరాబాద్ నగర సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలో తమ బంధువులు చనిపోవడంతో నగరానికి వచ్చినట్టు తెలుసుకున్న భవ్యకీర్తి పోలీసులకు సమాచారం చేసింది. దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులు.. జానకిని అరెస్టు చేయగా, రవిశంకర్ తప్పించుకుని ముంబైకు వెళ్లి.. అక్కడ నుంచి స్విట్జర్లాండ్‌కు పారిపోయాడు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments