Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు పెరుగన్నం తిన్న బాపట్ల పవన్ కళ్యాణ్... అడుక్కోవద్దంటూ ఫైర్

Webdunia
గురువారం, 5 మార్చి 2015 (16:35 IST)
పవన్ కళ్యాణ్ జన్మస్థలం గుంటూరు జిల్లానే. ఆయన పుట్టింది గుంటూరు జిల్లా బాపట్లలో. ఇపుడా సంగతి ఎందుకంటారా...? ఏదో గుంటూరుకు పవన్ వచ్చారు కాబట్టి అలా సందర్భానుసారంగా చెప్పాల్సిచ్చొందనుకోండి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఉదయం బేతపూడి గ్రామంలో ఓ స్టేజిపై నుంచి రైతులతో మాట్లాడారు. రైతులంతా తమతమ ఆవేదనలను, ఆందోళనలను పవన్ కళ్యాణ్ తో చెప్పుకున్నారు. తమను ఆదుకుంటే ఆజన్మాంతం రుణపడి ఉంటామన్నారు. 
 
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వుండగా ఓ మహిళా రైతు ఆయనకు పెరుగన్నం పెట్టిన టిఫిన్ బాక్సు ఇచ్చింది. దానిని తీసుకున్న పవన్ పెరుగన్నం రుచి చూసి ఎంతో బావుందన్నారు. ఇక ఆ తర్వాత రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల వద్ద నుంచి భూములను బలవంతంగా లాక్కుంటే మాత్రం చూస్తూ ఊర్కునేది లేదని హెచ్చరించారు. అలాగే ఏపీ ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ... ఇంకా ఎంతకాలం దేహి దేహి అని అడుక్కోవాలి... ప్రజాప్రతినిధులు ఇచ్చిన మాటకు కట్టుబడి దాన్ని సాధించుకుని రావాలని పిలుపునిచ్చారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments