Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్లకు చెబితే బోర్లా పడుకోబెట్టి గుండెపై తట్టమన్నారు...

Webdunia
బుధవారం, 12 మే 2021 (14:14 IST)
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిన్ సరఫరాలో తలెత్తిన లోపం వల్ల పదుల సంఖ్యలో కోవిడ్ రోగులు మృత్యువాతపడ్డారు. వీరిలో అనేకమంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. ఇలాంటివారంతా ఆస్పత్రిలో ఏం జరిగిందో పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. ముఖ్యంగా, తన భర్తను కోల్పోయిన మదనపల్లెకు చెందిన మాజీ కౌన్సిలర్‌ జయమ్మ తన భర్త ఏ విధంగా మృతి చెందాడో కన్నీటి పర్యంతమవుతూ వివరించింది. 
 
'వారంరోజుల మెరుగైన చికిత్సతో నా భర్త వేణుగోపాల్‌(50) కోలుకున్నాడు. గాలి బాగా పీల్చుకుని వదిలేస్తే బుధ, గురువారాల్లో డిశ్చార్చి చేస్తామని వైద్యులు చెప్పారు. అప్పుడప్పుడు ఆయన వెంటిలేటర్‌ తీసేసి బయటి గాలి పీల్చుకుంటూ ఉన్నాడు. నాకేం భయం లేదు. రెండు రోజుల్లో ఇంటికెళ్దామన్నాడు. ఆ మాట చెప్పిన కొన్ని గంటల్లోనే.. సోమవారం రాత్రి ఆక్సిజన్‌ ఆగిపోయింది. 
 
బాధితుల బంధువులు ఒక్కసారిగా వచ్చి బెడ్‌పై పడిపోవడంతో గందరగోళం నెలకొంది. మా ఆయన కళ్లు తేలేశాడు. డాక్టర్లకు చెబితే బోర్లా పడుకోబెట్టి గుండెపై తట్టమన్నారు. ఇలా అరగంట పాటు చేశా. అంతలోనే ఆక్సిజన్‌ వచ్చేసింది. కానీ, అప్పటికే మా ఆయన ప్రాణం పోయింది. ఐదు నిమిషాల్లో ఆక్సిజన్‌ వచ్చుంటే ప్రాణం నిలిచేదేమో?' అని మదనపల్లెకు చెందిన మాజీ కౌన్సిలర్‌ జయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు..

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments