Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటింగ్ సైట్ల ద్వారా చాటింగ్.. ఆపై మనీ కోసం బ్లాక్ మెయిల్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే టార్గెట్.. క్యూటీ అరెస్ట్

డబ్బు కోసం పెడదారి పట్టే మహిళల సంఖ్య అధికమవుతోంది. డేటింగ్ సైట్లలో మోసానికి పాల్పడుతూ.. భారీ మొత్తాన్ని గుంజుకునే కిలాడీ లేడిగి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, చైతన్యపురికి చె

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2016 (16:18 IST)
డబ్బు కోసం పెడదారి పట్టే మహిళల సంఖ్య అధికమవుతోంది. డేటింగ్ సైట్లలో మోసానికి పాల్పడుతూ.. భారీ మొత్తాన్ని గుంజుకునే కిలాడీ లేడిగి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, చైతన్యపురికి చెందిన క్యూటీ (27) పలు పేర్లతో డేటింగ్ సైట్ల ద్వారా పురుషులతో చాటింగ్ చేసేది.

వారితో మాట కలిపి.. ఫోన్ నెంబర్ ఇచ్చి.. డేటింగ్‌కు వస్తానని కోరేది. మల్టీ ప్లెక్సుల్లో నాలుగు సినిమా టికెట్లు బుక్ చేయాలని కోరి, తన ఈ-మెయిల్ ఐడీని పంపేది. ఇలా నగరంలో హైటెక్ బడాబాబులను, సాఫ్ట్ వేర్లను ముంచింది. అంతటితో ఆగకుండా వారితో ఏర్పడిన పరిచయాన్ని కూడా క్యాష్ చేసుకునేది. 
 
సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫ్యామిలీ ఫోటోలను చేతిలో పెట్టుకుని బెదిరింపులకు పాల్పడేది. డబ్బు అడిగింది ఇవ్వకపోతే.. ఫ్యామిలీకి అన్నీ విషయాలు చెప్పేస్తానని వార్నింగ్ ఇచ్చేది. ఇలా మోసపోయిన ఓ వ్యక్తి.. తన స్నేహితుడు కూడా అదే అమ్మాయితో పరిచయం ఏర్పరుచుకోవడం చూసి షాక్ అయ్యాడు.

అంతే పోలీసులకు సమాచారం చేరవేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి క్యూటీని అరెస్ట్ చేశారు. అనంతరం ఆమె వద్ద జరిపిన విచారణలో కిలేడీ అసలు పేరు బట్టు రాజేశ్వరి అని తేలింది.  బాగా చదువుకుని.. ఈజీగా డబ్బు సంపాదించడం కోసం టెక్నాలజీని వాడుకుందని.. అయితే అడ్డంగా దొరికిపోయిందని పోలీసులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments