Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ సాయంతో పొరుగింట్లో కుర్రోడితో భార్య.. కళ్లారా చూసిన భర్త... శవాలుగా ఆ ఇద్దరు..

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (09:39 IST)
ఓ మహిళ సహకారంతో పక్కింట్లో తన భార్య పరాయి వ్యక్తితో శారీరకంగా కలిసివుండటాన్ని కట్టుకున్న భర్త, అతని కుటుంబ సభ్యులు కళ్లారా చూశారు. ఇదేంపనంటూ భార్యను భర్త నిలదీశారు. ఆ తర్వాత భార్యతో పాటు.. ఆమెతో గడిపిన వ్యక్తిని బలవంతంగా మరో ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించారు. ఆ తర్వాత వారు కొద్దిసేపటికే శవాలుగా మారారు. ఈ ఇద్దరు ఎలా చనిపోయారన్న అంశంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
పశ్చిమ గోదావరి నిడదవోలు మండలం తాళ్ళపాలెం గ్రామంలో జరిగిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, తాళ్లపాలెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ యామన శ్రీనివాసరావుకు ఏలూరుకు చెందిన కుసుమ నాగసాయి (30) అనే మహిళతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. నాగసాయికి ఏలూరుకు చెందిన షేక్‌ నాగూర్‌ (28) అనే యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ క్రమంలో నాగూర్ తాళ్లపాలెం అపుడపుడూ వచ్చి.. ఓ మహిళసాయంతో ఆమె ఇంట్లోనే నాగసాయితో శారీరకంగా కలుస్తూ వెళ్లేవాడు. ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో భార్యపై ఓ కన్నేసిన భర్త... ఒక ఇంట్లో నాగసాయి - నాగూర్‌లు కలిసివుండగా భర్త శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు చూసి వారిని నిలదీశారు. 
 
ఆ తర్వాత వారిద్దరినీ ఒక కారులో శెట్టిపేట శ్రీకృష్ణ మొబైల్‌ ఫాస్ట్‌ఫుడ్‌ షాపు గదిలోకి తీసుకువెళ్లి నిర్బంధించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి నాగసాయి, నాగూర్‌లు పురుగు మందు తాగి అనుమానాస్పదంగా మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు 
 
ఈ కేసులో మృతురాలి భర్త శ్రీనివాసరావుతో పాటు అతని కుటుంబ సభ్యులను నిడదవోలు సీఐ కేఏ స్వామి, ఎస్సై జగదీశ్వరరావులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, వివాహిత నాగసాయి, యువకుడు నాగూర్‌ల వివాహేతర సంబంధం బయటపడటంతో అవమాన భారంతో పురుగుమందు తాగారా..? లేదా ఆమె భర్త శ్రీనివాసరావు బంధువులు వారిద్దరితో బలవంతంగా తాగించరా..? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. 
 
కాగా, ఏలూరు నుంచి నాగూర్‌ వచ్చి తాళ్లపాలెంలో ఉన్న నాగసాయిని పలుమార్లు స్థానికంగా ఉండే మహిళ సహకారంతో ఒక ఇంట్లో కలుసుకునేవారని, ఆదివారం కూడా ఇలాగే జరగడంతో భర్త, అతని కుటుంబ సభ్యులు వీరిని గదిలోనే పట్టుకుని ఇద్దరినీ కొట్టి బలవంతంగా పురుగు మందు తాగించి చంపేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments