Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు స్నేహితుడితో ఎఫైర్, భర్తకు తెలిసింది, అంతే...

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (22:17 IST)
వరసకు కొడుకైన వ్యక్తితోనే అక్రమ సంబంధం పెట్టుకుంది ఒక వివాహిత. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్న ఆమె భర్త పనుల మీద తరచూ బయటకు వెళ్ళడంతో వరుసకు కొడుకయ్యే వ్యక్తితో కమిట్ అయ్యింది. ఇది కాస్తా ఆమెను చివరకు కటాకటాల పాలు చేసింది.
 
తూర్పు గోదావరిజిల్లా పత్తిపాడు మండలం చింతలూరులో నివాసముంటున్నారు జంకల అప్పారావు. నిన్న ఆయన తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు భార్యను విచారించడంతో అసలు విషయం ఒప్పుకుంది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
అప్పారావు నూనె వ్యాపారం చేసేవాడు. తరచూ వివిధ ప్రాంతాలకు వెళ్ళేవాడు. ఇంటి పట్టున ఉండేవాడు కాదు. అప్పారావు భార్య ఇంట్లోనే ఉండేది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే తన కుమారుడి స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది తల్లి.
 
అతనితో పాటు మూడు నెలల పాటు బాగా ఎంజాయ్ చేసింది. అయితే భర్తకు విషయం తెలియడంతో మందలించాడు. పెళ్ళీడుకొచ్చిన కుమార్తెలు ఉంటే ఈ పనులు ఏంటంటూ ప్రశ్నించాడు. దీంతో భర్త హత్యకే స్కెచ్ వేసింది భార్య.
 
ప్రియుడితో కలిసి నిన్న రాత్రి నిద్రపోతున్న అప్పారావును దారుణంగా హత్య చేసింది. దోపిడీ దొంగల పనేనని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు జరిపితే అసలు విషయం బయటపడింది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రాజమౌళి, మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ తెలిపిన రామ్ చరణ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments